OG Hungry Cheetah Song: పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)హీరోగా నటించిన ఓజి(OG) సినిమా సెప్టెంబర్ 25వ తేదీ ప్రేక్షకుల ముందు మంచి టాక్ సొంతం చేసుకోవడమే కాకుండా అద్భుతమైన కలెక్షన్లను కూడా రాబడుతుంది. ఇక ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఎక్కడ చూసిన ఓజీ మేనియా నడుస్తోంది. ఇక ఈ సినిమా విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లను కూడా నిర్వహించకపోయినా సినిమా పై మాత్రం చాలా మంచి బజ్ ఏర్పడిందని చెప్పాలి. ఇలా ఈ సినిమాకు ఇంత హైప్ రావడానికి ప్రధాన కారణం ఈ సినిమా నుంచి విడుదల చేసిన గ్లిమ్స్ అని చెప్పాలి. “హంగ్రీ చీటా”(Hungru Cheetah) అంటూ వచ్చిన ఈ గ్లిమ్స్ సినిమాకు భారీ స్థాయిలో పబ్లిసిటీని తీసుకువచ్చింది.
“నెత్తురుకు మరిగిన హంగ్రీ చీటా.. శత్రువుని ఎంచితే మొదలు వేట.. చూపుగాని విసిరితే ఓర కంట.. డెత్ కోట కన్ఫర్మ్ అంట”అంటూ వచ్చిన ఈ గ్లిమ్స్ మంచి అంచనాలనే పెంచేసింది. ఇక ఈ సినిమాలో దాదాపు 8 సార్లు పవన్ కళ్యాణ్ ఎలివేషన్ కోసం హంగ్రీ చీటా సాంగ్ వాడారు అంటే ఈ సినిమా ఎలాంటి ఆదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలా ఈ పాట మంచి సక్సెస్ కావడంతో ఈ పాట వెనుక ఉన్న సింగర్ ఎవరు అనే విషయంపై ఎన్నో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక ఈ పాట వెనుక పెద్ద కథ ఉందని తెలుస్తోంది.
ఈ పాటకు లిరిక్స్ అందించింది యువ సంగీత దర్శకుడు అనే విషయం ఒక ఇండస్ట్రీ వారికి తప్ప బయట ప్రేక్షకులకు అభిమానులకు పెద్దగా తెలియదు. హంగ్రీ చీటా పాట పాడింది టాలీవుడ్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ ఆర్ ధ్రువన్. కానీ ఈ పాట క్రెడిట్ లిరిక్స్ సెక్షన్ వద్ద మాత్రం రఘురాం అని ఉంటుంది. వాస్తవానికి ఇతని పూర్తి పేరు రఘురాం ధ్రువన్(Raghuram Dhruvan) . ఈయన సంగీత దర్శకుడిగా పని చేస్తూనే మరోవైపు లిరిసిస్ట్, సింగర్ గా కూడా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. సాయి దుర్గ తేజ హీరోగా వచ్చిన “సోలో బ్రతికే సో బెటర్” సినిమాలో “నో పెళ్లి”, “హే ఇది నేనేనా” వంటి పాటలకు గేయ రచయితగా తన కెరీర్ ప్రారంభించారు.
ప్రశంసలు కురిపిస్తున్న పవన్ ఫ్యాన్స్…
సింగర్ గా ఈయన రామ్ పోతినేని స్కంద సినిమాలో నీ చుట్టూ నీ చుట్టూ, మ్యాడ్లు ప్రౌడ్ సే సింగిల్, లియోలు నే రెడీ, ఓజీలో హంగ్రీ చీటా, గని సినిమాలో రోమియోకి జూలియట్ వంటి పాటలను ఆలపించారు. ఈ పాటలన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. ఇక సంగీత దర్శకుడిగా ధ్రువన్ “ఉషా పరిణయం”, “లంబసింగి”, “మిత్రమండలి” వంటి ఎన్నో సినిమాలకు సంగీత దర్శకుడిగా పనిచేశారు. ఇలా ఈయన ఇండస్ట్రీలో సంగీత దర్శకుడిగా గేయ రచయితగా, సింగర్ గా కొనసాగుతూ ప్రస్తుతం ఎంతో బిజీగా ఉన్నారు.. ఇక తాజాగా ఓజి సినిమాలో హంగ్రీ చీటా పాట కూడా చార్ట్ బస్టర్ కావడంతో ఈయన గురించి తెలిసి పవన్ కళ్యాణ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా ఓ దశాబ్ద కాలం పాటు సెలబ్రేషన్ చేసుకునే సాంగ్ మా హీరోకి ఇచ్చారు అంటూ ధ్రువన్ పై పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తున్నారు.
Also Read: Sujeeth: ఓజీ యూనివర్స్ నుంచి మరో అప్డేట్.. పవన్ ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా!