Rakul Preet Singh: ప్రతి ఒక్కరికి ఒక పర్టికులర్ టైం నడుస్తుంది. ఆ టైంలో విపరీతమైన అవకాశాలు వస్తాయి. చాలామంది అభిమానులు చుట్టూ చేరుతారు. కానీ ఇదంతా కూడా సక్సెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక్కసారి ఫెయిల్యూర్ మనల్ని చుట్టుముడితే మన చుట్టూ ఎవరూ ఉండరు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఒక వెలుగు వెలిగారు. చాలామంది హీరోయిన్లు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు.
ఇలా వచ్చి అలా వెళ్ళిపోయినా హీరోయిన్స్ లో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. రకుల్ కెరియర్ లో కూడా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోస్ తో కూడా సినిమాలు చేసి మంచి సక్సెస్ అందుకుంది రకుల్. అయితే క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వైష్ణవ తేజ్ హీరోగా వచ్చిన కొండ పొలం సినిమా తర్వాత మళ్లీ కనిపించలేదు. ఆ సినిమాలో ఓబులమ్మ అనే పాత్రలో కనిపించింది.
హీరోయిన్లకి కేవలం సినిమాల్లో అవకాశాలు రావడమే కాకుండా.. వాళ్లకు సినిమాల్లో వచ్చిన గుర్తింపు ద్వారా బయట ప్రమోషన్స్ చేసుకునే అవకాశాలు కూడా వస్తాయి. చాలా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ కూడా వాళ్లతోనే చేయిస్తారు. కొన్ని కంపెనీలకి బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తారు.
ఇక రకుల్ ప్రీత్ సింగ్ విషయానికి వస్తే నువన అనే లగ్జరీ హెల్త్ అండ్ వెల్నెస్ క్లినిక్, పెయిన్ రిలీఫ్ , స్కిన్ అండ్ హెయిర్ ట్రీట్మెంట్ ఇవన్నీ చేసే క్లినిక్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తుంది రకుల్ ప్రీత్ సింగ్. ఆ క్లినిక్ కి సంబంధించిన పిన్ చేసిన పోస్టులో రకుల్ ఫోటో కూడా ఉంటుంది.
ఇక తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక స్టోరీ షేర్ చేస్తూ.. సండే రిపేర్ విత్ నూవాన అంటూ బెడ్ పైన పడుకొని ఉన్న వీడియోను షేర్ చేసింది. సడన్ గా ఏమైపోయిందో అనుకుని చాలామంది ఓపెన్ చేశారు. ఇక రకుల్ మెన్షన్ చేసిన క్లినిక్ చూసి ఓహో ఇదంతా ప్రమోషన్ కోసమా అని నెటిజెన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఇంకొంతమంది అయితే మాత్రం సినిమా లేకపోవడం వలన ఎప్పుడు అదేపనిగా ప్రమోషన్స్ చేసుకోవడమేనా అనే ఆలోచనలో ఉన్నారు.
ఒకప్పుడు తెలుగులో వెలుగు వెలిగిన రకుల్ ఇప్పుడు తెలుగు సినిమాలకు దూరం అయిపోయింది. తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ లో కూడా ఒక తెలుగు సినిమా లేదు. అన్ని హిందీ తమిళ్ సినిమాలు ఉన్నాయి. శంకర్ దర్శకత్వంలో ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఇండియన్ 2 సినిమాలో కూడా రకుల్ కనిపించింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా రిజల్ట్ ఏంటో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.
Also Read: Upasana Ram Charan : బతుకమ్మ వేడుకల్లో మెగా కోడలు ఉపాసన కొణిదెల, ఏకంగా ఢిల్లీలో కూడా..