BigTV English

Gold : తల్లి బంగారం కూతురుకి ఇవ్వాలన్నది ఆచారమా….

Gold : తల్లి బంగారం కూతురుకి ఇవ్వాలన్నది ఆచారమా….


Gold : ఆస్తి పంపకాల్లో తల్లి బంగారం కూతురుకి ఇవ్వాలన్న పద్దతిని కొన్ని ఇళ్లల్లో పాటిస్తుటారు. కొడుకులు కూతుళ్లు ఉన్నా తల్లికి చెందిన నగలు మాత్రం కూతురికి ఇవ్వాలని గతంలో పెద్దలు చెప్పేవారు. ఈ రోజుల్లో సంగతి ఎలా ఉన్నా పాత రోజుల్లో చాలా ప్రాంతాల్లో ఇలాంటి పంపకాలు జరిగేవి. స్త్రీ తల్లిగా, ఇల్లాలిగా, చెల్లిగా, భార్యగా ఇలా రకరకాల బాధ్యతల్లో మారుతూ ఉంటుంది. స్త్రీ తల్లి అయినప్పుడు , కూతురు అయిన సందర్భాల్లో రెండు ముఖాలను కలిగి ఉంటుంది. తల్లిగా ఒకలాగా ఉంటూ, అత్తగారిలా మరోలా ఉంటుంది. ఇదే స్త్రీ కూతురిలా మారినప్పుడు ఒక విధంగా కోడలిగా మారినప్పుడు మరో రకంగాను ఉంటుంది.

తల్లిగా ఒకలాగా ప్రవరిస్తుంది. అత్తలాగా మరో విధంగా పాత్ర పోషిస్తుంది. ఏ అత్తను కోడలు తల్లిగా సంపూర్ణంగా భావించదు. ఏ అత్తా కోడల్ని కూతురిగా భావించదన్న భావన ఎక్కువమందిలో ఉంటుంది.తల్లిగా కూతుర్ని మెచ్చుకుంటూ కోడలి విషయంలో మాత్రం ఫిర్యాదు చేస్తుంటారు. కొందరు. ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే కోడల్ని కూతురిగా చూస్తుంటారు. అత్తగారు కాలం చేస్తే నల్లపూసలు, తాళిబొట్టు కూతురిగా ఇవ్వాలని అంటారు. కాని వాస్తవానికి అది నిర్ణయించే అధికారం బంగారం యజమానికే ఉంటుంది. ఆడపిల్లకి పెళ్లి చేసి అత్తారింటికి కట్నకానుకలతో పంపినా…వారి చూపు ఎప్పుడూ పుట్టింటిమీదే ఉంటుంది. వాళ్లు అభివృద్ధి చెందాలనే కోరుకుంటూ ఉంటారు.


తండ్రి ఆస్తి కొడుకు వెళ్తే, తల్లి ఆస్తి అంటే బంగారం లాంటిది కూతురుకి ఇవ్వడం సమంజసం. కాని ఈ విషయంలో కొడుకులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉంటారు. కానీ తల్లిబంగారం కూతురికి ఇవ్వాలన్న సంప్రదాయం, పడికట్టు ఉంది. తల్లి బంగారం మీద కొడుకులు ఆశపడకూడదు. పిత్రార్జితనాన్ని తీసుకునే కొడుకు, తల్లి ఆస్తి బంగారంపై మాత్రం ఆశపడకూడదని పెద్దలు సూచిస్తున్నారు. తల్లి బంగారం కూతురుకి ఇవ్వడం ద్వారా సోదరికి మేలు చేసిన వాళ్లవుతారు. ఆస్తి పంపకాల విషయంలో సంప్రదాయాలు, ఆచారాలు ఈ రోజుల్లో మారుతూ వస్తున్నాయి. పూర్వం రోజుల్లో అయితే ఇదే పద్దతిని అనుసరించే వారు.

Related News

Chanakya Niti: చాణక్య నీతి: కుటుంబ పెద్ద ఆ ఒక్క పని చేస్తే చాలు – ఆ ఇల్లు బంగారంతో నిండిపోతుందట

Vastu Tips: వాస్తు ప్రకారం.. ఇంట్లో డబ్బు ఎక్కడ దాచాలి ?

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Big Stories

×