BigTV English

Eating : తిన్న తర్వాత మన కంచం మనం తీస్తే దోషమేనా ?

Eating : తిన్న తర్వాత మన కంచం మనం తీస్తే దోషమేనా ?


Eating : పూర్వం రోజుల్లో కుటుంబాలు పెద్దగా ఉండేవి. బాబాయ్, పిన్ని, చిన్నాన్న, పెద్దనాన్న, పెద్దమ్మ,తాత,బామ్మ ఇలా ఇల్లంతా జనంతో నిండుగా ఉండేవి . అన్నదమ్ములు ఉమ్మడిగా కలిసి ఉండే రోజులవి. ఇంట్లో భోజనాలు చేసిన తర్వాత ఆడవారు మాత్రమే కంచాలు తీసి శుద్ధి చేసేవారు. ఆడ, మగ తేడా ఉండి సమానత్వం పాటించని రోజుల్లో ఇలాంటివి ఉండేవి. ఇప్పుడు రోజులు మారాయి. ఎవరి కంచం వారే తీసుకునే పరిస్థితులు ఉన్నాయి . కానీఈరోజుల్లో ఆ పద్దతి లేదు. ఇంటికి వచ్చిన అతిథి భోజనం తర్వాత వారు తిన్న కంచెం లేదా ఆకును ఇంటి యజమానే స్వయంగా తీసేవారు. ఇంటికి వచ్చిన అతిథి ముట్టుకునేవారు కాదు.. ఒక వేళ వాళ్లే తీస్తామన్నా వద్దని వారించే వారు. కారణం మన ఇంటికి ఎవరైనా వచ్చి భోజనం చేసిన ఆకుని మనం తీయడం వల్ల వారికి భోజనం పెట్టిన ఫలితం ఉంటుంది. అదే ఎంగిలి కంచాన్ని తిన్న వారే తీస్తే ఆ భోజనం పెట్టిన ఫలితం కలగదు అని శాస్త్రం చెబుతోంది.ఇంటికి అతిథి వస్తే భోజనం ఆప్యాయంగా వడ్డించే పద్దతి నేడు కూడా కొనసాగుతోంది

పెద్దవారితోకానీ, ముత్తయిదవులతో ఎంగిలి విస్తర్లు తీయంచకూడదు. అలా చేయడం అతిథికి మనం ఇచ్చే మర్యాదగా భావించాలి. మర్యాదల వల్ల మానవ సంబంధాలు సక్రమంగా ఉంటాయి. ఇంట్లో పెద్ద వారు ఉంటే వారు తిన్న కంచెన్ని తీసి శుభ్రం చేయడం వారికిచ్చే గౌరవంగా లెక్కించాలి. ఇంటికి వచ్చిన అల్లుడి విషయంలో కూడా ఇదే పద్దతి పాటించాలని నియమం ఉంది. అత్తారింటికి అల్లుడు ఎప్పుడూ అతిథే అవుతారు. సమారాధన చేసినప్పుడు మాత్రం గృహస్తే ఆకులు తీయాలన్న నియమం ఉంది. బయట సంతర్పణ సమయాల్లో అక్కడ భోజనం చేసిన వారిని ఆకులు తీయనివ్వరు. అది వేరే వారితో చేయిస్తుంటారు.


ఈరోజుల్లో పిల్లలకు ఎవరి పని చేసుకునే అలవాటు నేర్పించాలి. ఉమ్మడి కుటుంబాలు కనుమరుగై భార్య, భర్త , పిల్లలు మాత్రమే ఉండే చిన్న కుటుంబాలు సాగుతున్న రోజులివి. కాబట్టి పిల్లలకి ఎవరి కంచం వారే తీసి శుభ్రం చేసుకునే అలవాటు నేర్పించడం అవసరం. రేపటి రోజుల్లో బయటికి వెళ్లి బతకడానికి ఇలాంటివి నేర్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే . ఇంట్లో ఎవరి కంచం వారు తీయడం వల్ల ఎలాంటి దోషాలు ఉండవని శాస్త్రం చెబుతోంది.

Related News

Chanakya Niti: చాణక్య నీతి: కుటుంబ పెద్ద ఆ ఒక్క పని చేస్తే చాలు – ఆ ఇల్లు బంగారంతో నిండిపోతుందట

Vastu Tips: వాస్తు ప్రకారం.. ఇంట్లో డబ్బు ఎక్కడ దాచాలి ?

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Big Stories

×