BigTV English

Dwarka:ద్వారక నగరం అంతం ముందే నిర్ణయమైందా..

Dwarka:ద్వారక నగరం అంతం ముందే నిర్ణయమైందా..

Dwarka:శ్రీకృష్ణుడు నిర్మించిన ద్వారక నిర్మాణం, అంతం వెనుక ఎన్నో రహస్యాలు దాగున్నాయి. వేల సంవత్సరాల క్రితం కళకళలాడిన మహానగరం శ్రీ కృష్ణుడు నడిచిన చోటు. అంతటి మహాక్షేత్రం సముద్ర గర్భంలో కలసి పోయింది అని పురాణాలు చెబుతున్నాయి. జరాసంధుడు కృష్ణుడికి వ్యతిరేకి… కృష్ణయ్యను ఓడించడానికి నిత్యం మదుర నగరంపై తన సైన్యంతో దండయాత్ర చేస్తుండేవాడు. ఆ యుద్ధంలో ఎంతోమంది మధుర నగర ప్రజలు తమ ప్రాణాలను కోల్పోయే వారు. జరాసంధుడి బారి నుంచి మధుర వాసుల్ని కాపాడటానికి కొత్త నగరాన్ని సముద్రం మధ్యలో నిర్మించి ప్రజలను అక్కడికి తరలించాలని.. నిర్ణయించుకున్నారు. దాంతో జరాసంధుడి బాధ మధుర నగర వాసులకు తీరుతుందని అనుకున్నాడు.


విశ్వ కర్మను పిలిపించి మధుర నగర ప్రజల అయినటువంటి యాదవుల కొరకు ఒక సురక్షితమైన, సుందరమైన నగరం నిర్మించమని సూచించారు. అలాగే ఈ నగర నిర్మాణం కొరకు భూమిని ఇవ్వాలంటూ సముద్రుడిని కృష్ణుడు ఆదేశించగా…వెనువెంటనే సముద్రుడు వెనక్కి జరిగి పన్నెండు యోజనాల భూభాగాన్ని ఇచ్చినట్లు పురాణాల్లో ఉంది. గోమతీ నది సముద్రంలో కలిసే చోటులో విశ్వకర్మ నిర్మించినటువంటి అందమైన నగరమే ద్వారక. నగరంలో 900 లక్షల రాజభవనాలు ఉండేవట… ఈ లెక్క వింటుంటేనే ఆ నగరం ఎంత పెద్దదో అర్థం అవుతోంది. అంతే కాకుండా ఈ ద్వారకా నగరాన్ని విశ్వకర్మ .. వజ్రాలు, క్రిస్టల్స్, ముత్యాలు, బంగారం వంటి అపురూపమైన రత్నాలతో నిర్మించారు.

మహాభారతం యుద్ధం ముగిసిన తర్వాత బిడ్డల్ని కోల్పోయిన గాంధారిని పరామర్శించడానికి వెళ్లిన శ్రీకృష్ణుడ్ని శపించింది. నీవు నాలాగే కళ్ల ముందే పిల్లలను కోల్పోయే పరిస్థితి వస్తుంది, నీ యాదవ జాతి మొత్తం నీతోటే అంతమై పోవాలి అంటూ శపించింది. అలా ఆమె శాపమే యాదవులలో చిచ్చు రగిలేలా చేసింది. పదవుల కోసం గొడవలు జరిగి ఒకరినొకరు చంపుకొనే వరకు వెళ్లింది.. దాంతో కృష్ణ భగవానుడు అది చూడలేక మిగిలిన వారిని ఆ ప్రదేశం నుండి వేరే ప్రాంతానికి మార్చి తను ఈ లోకం వీడి శాశ్వతంగా వెళ్ళిపోతానంటూ అలాగే నా తర్వాత ద్వారకానగరం అంతమవుతుందని అని అర్జునుడికి తెలిపినట్లు పురాణాల్లో ఉంది


Related News

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Big Stories

×