Pawan Kalyan: పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం సినిమాలు చేయటం తగ్గించేశారు. వకీల్ సాబ్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ ఒప్పుకున్న సినిమాలన్నిటిని కూడా పూర్తి చేసేశారు. కొత్తగా పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఇప్పటివరకు ఏ సినిమా అప్డేట్ కూడా రాలేదు. అయితే పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేస్తారు అని కొంతమంది నిర్మాతల పేర్లు వార్తల్లో ఎక్కువగా వినిపిస్తున్నాయి. తమిళ దర్శకులు కూడా పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి పోటీ పడుతున్నట్లు గట్టిగా వార్తలు వినిపించాయి.
మరోవైపు పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో బిజీగా మారిపోయారు. సినిమా పనులన్నీ పూర్తయిపోవటం వలన తన దృష్టి అంతా పూర్తిస్థాయి పాలిటిక్స్ మీద ప్రస్తుతం పెట్టారు. అయితే పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో ఉన్న సినిమాల్లో ఉన్న ఆయన ఒక్కసారి బయట కనిపిస్తే చాలు అభిమానులకు అదే ఆనందం. ఇక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఆంధ్రప్రదేశ్లో తన బాధ్యతను నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత తన వస్త్రాదరణ కంప్లీట్ గా మారిపోయింది. జనసేన సభ ఏర్పాటు చేసినప్పుడు పవన్ కళ్యాణ్ వేసుకున్న బట్టల మీదకే అందరి దృష్టి వెళ్ళింది. ఆ తరువాత సభ జరిగినప్పుడు చాలా స్టైలిష్ గా సభకు హాజరయ్యారు పవన్ కళ్యాణ్. అప్పుడు కూడా రాజకీయాలంటే ఈ బట్టలే వేసుకొని చెయ్యాలి అని రూల్ ఏమైనా ఉందా అని అప్పట్లో స్పీచ్ కూడా వైరల్ అయింది.
అయితే ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పవన్ కళ్యాణ్ లుక్స్ చూస్తుంటే మాత్రం చాలా క్రేజీగా అనిపిస్తున్నాయి. మోస్ట్ స్టైలిష్ పొలిటిషియన్ అని చెప్పాలి. బద్రి సినిమాలో పవన్ కళ్యాణ్ గెటప్స్ ఒకప్పుడు అలానే ఉండేవి. ఇప్పుడు దాదాపు మళ్లీ బద్రి లుక్స్ వచ్చేసాయి.
మరోవైపు హరీష్ శంకర్ దర్శకత్వంలో రాబోయే ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా కోసమే పవన్ కళ్యాణ్ అలా రెడీ అవుతున్నారు అంటూ సోషల్ మీడియాలో కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గా దేవిశ్రీప్రసాద్ కూడా పవన్ కళ్యాణ్ డాన్స్ అదరగొడుతున్నారు అంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.
గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. అందుకే ప్రస్తుతం రాబోయే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మీద విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా 2026 లో విడుదల కానుంది.
Also Read: Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?