BigTV English
Advertisement

OTT Movie : రాకుమారిని వెంటాడే నాగ బంధనం… ఆత్మను ప్రేమించే నరుడు… ఓటీటీలో సరికొత్త థ్రిల్లర్

OTT Movie : రాకుమారిని వెంటాడే నాగ బంధనం… ఆత్మను ప్రేమించే నరుడు… ఓటీటీలో సరికొత్త థ్రిల్లర్

OTT Movie : పురాతన శాపాలు, మాయా పుస్తకం, డ్రాగన్ లాంటి సూపర్‌ నాచురల్ ఎలిమెంట్స్‌తో వచ్చిన ఒక కథ ఓటీటీలో చూసేయండి. దాదాపు రెండు గంటల నిడివి ఉన్న ఈ లో బడ్జెట్ సినిమా, థియేటర్లలో మిక్స్డ్ టాక్ తో నడిచింది. ఒక మయా పుస్తకం చుట్టూ ఈ కథ తిరుగుతుంది.  ఫాంటసీ థ్రిల్లర్ అభిమానులు, ఈ సినిమాపై కూడా ఓ లుక్ వేయండి. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..


ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే 

‘మాయా పుతగం’ (Maya Puthagam) అనేది ఒక తమిళ ఫాంటసీ థ్రిల్లర్ మూవీ. రామ జయప్రకాష్ దర్శకత్వంలో శ్రీకాంత్, అశోక్ కుమార్, అపర్ణ నటించారు. ఈ సినిమా 2024 జూలై 19న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో, సింప్లీ సౌత్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ ఏమిటంటే

అశోక్ కుమార్ అనే అసిస్టెంట్ డైరెక్టర్ కి, ఒక రాత్రి డ్రాగన్ గురించి వింత కల వస్తుంది. ఆ డ్రాగన్ ఒక పుస్తకాన్ని కాపాడుతుంది. మరుసటి రోజు ఒక స్వామిజీ అతన్ని కలుస్తాడు. స్వామిజీ అతనికి ఆ మాయ పుస్తకం ఇస్తాడు. అతను గాంధార హిల్‌లోని సెల్వపురి ప్యాలెస్‌కు వెళ్లు, ప్రొడ్యూసర్ సంబశివంను కలువు అని చెప్పి వెళ్తాడు.  గురు ఆ పుస్తకం కథను ఫిల్మ్‌గా తీయాలని ప్లాన్ చేస్తాడు. అతను సంబశివంను కలుస్తాడు. ఆ పుస్తకం ఓపెన్ చేస్తే ఫ్లాష్‌బ్యాక్ మొదలవుతుంది. 200 సంవత్సరాల క్రితం సెల్వపురి రాజ్యంలో ప్రిన్సెస్ పంచమ దేవి అనే ఒక అందమైన రాకుమారి ఉండేది. ఆమెకు ఒక పాము రూపం ఉంది. రాత్రయితే ఆమె పాముగా మారుతుంది. రాజు అయిన ఆమె తండ్రి ఎవరికంటా పడకుండా దాచి పెంచుతాడు.


Read Also : అమ్మాయిల మధ్య తేడా యవ్వారం… ట్రిప్పు కోసం వెళ్లి సైకో కిల్లర్ల చేతిలో అడ్డంగా బుక్… బ్రూటల్ బ్లడ్ బాత్

అయితే ఒక రోజు ఆ రాజ్యంలోని మంత్రి ఆమె రహస్యాన్ని తెలుసుకుని బ్లాక్‌ మెయిల్ చేస్తాడు. దీంతో పంచమ దేవి అతన్ని చంపుతుంది. కానీ మంత్రి చచ్చే ముందు, ఈ ప్యాలెస్‌లో ఎవరైనా ఈ రహస్యం తెలుసుకుంటే, డ్రాగన్ వచ్చి అందరినీ చంపుతుందని శాపం పెడతాడు. పంచమదేవి మాయ పుస్తకంలో తన కథ రాసి, ప్యాలెస్‌లో దాచుతుంది. ఆమె ఆత్మ డ్రాగన్‌గా మారి పుస్తకాన్ని కాపాడుతుంటుంది. ఇప్పుడు వీళ్లిద్దరూ ఆ ప్యాలెస్ కి వెళ్తారు. అక్కడ పుస్తకం తెరిస్తే డ్రాగన్ నిజంగా వస్తుంది. డ్రాగన్ రూపంలో ఉన్న పంచమ దేవి ఆత్మ ఈ శాపం నుంచి విడుదల కావాలని కోరుతుంది. చివరికి ఆమె శాపం పోతుందా ? గురు శాపం బ్రేక్ చేయడానికి ఏం చేస్తాడు ? పంచమదేవి ఆత్మ శాంతి పొందుతుందా ? అనే విషయాలను, ఈ ఫాంటసీ థ్రిల్లర్ సినిమాని చూసి తెలుసుకోండి.

 

 

Related News

OTT Movie : దొంగను దేవుడిగా మార్చే కోహినూర్ డైమండ్… బిచ్చగాళ్లతో కలిసి అరాచకం… కడుపుబ్బా నవ్వించే తమిళ కామెడీ మూవీ

OTT Movie : దెయ్యాలను తరిమికొట్టే సిస్టర్స్… కుర్రాడి ఎంట్రీతో కథలో ట్విస్ట్… తెలుగులోనూ హర్రర్ మూవీ స్ట్రీమింగ్

OTT Movie : నలుగురు కుర్రాళ్ళు ఒకే అమ్మాయితో… నెలలోపే ఓటీటీలోకి క్రేజీ క్రైమ్ కామెడీ చిత్రం

OTT Movie : భర్త ఉండగా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో… మన తెలుగు సినిమానే కాపీ కొట్టారు మావా

OTT Movie : అమ్మాయిల డర్టీ స్కామ్… ఆటగాళ్లే వీళ్ళ టార్గెట్… అన్నీ అవే సీన్లు మావా

OTT Movie : పక్షవాతం వచ్చినోడితో ప్రేమాయణం… గుండెను పిండేసే ప్రేమకథ… లవర్స్ డోంట్ మిస్

OTT Movie : చిన్న చిలిపి పనితో పనిష్మెంట్… టీనేజర్ల కథ మొదలవ్వకుండానే కంచికి… మతిపోగొట్టే కథ

Big Stories

×