Gollapalli Surya Rao: మాజీ మంత్రి, రాజోలు వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జి గొల్లపల్లి సూర్యారావు గుండెపోటుకు గురయ్యారు. దీంతో గమనించిన కుటుంబ సభ్యులు వెంటను ఆయన్ను అమలాపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సూర్యారావుకు వైద్యులు స్టంట్ వేసినట్టు సమాచారం. వైసీపీ కార్యకర్తల సమావేశం జరుగుతుండగానే ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.
ఏపీలో పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీ నిర్మాణం, నిర్వహణను వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రజల నుంచి కోటి సంతకాలను సేకరించాలని పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 6 నుంచి శివకోటి గ్రామంలో కోటి సంతకాల సేకరణకు పిలుపునివ్వగా.. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో సూర్యారావు మాట్లాడుతున్న సమయంలోనే గుండెపోటుకు గురయ్యారు. దీంతో కార్యకర్తలు, కుటుంబ సభ్యులు హుటా హుటిన సమీప ఆస్పత్రికి తరలించారు. సరైన టైంలో ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడినట్టు వైద్యులు తెలిపారు.