BigTV English
Advertisement

Jai Hanuman :- ఆంజనేయుడి ఫోటో ఏ దిశలో పెట్టుకోవాలి?

Jai Hanuman :- ఆంజనేయుడి ఫోటో ఏ దిశలో పెట్టుకోవాలి?

Jai Hanuman:- వాస్తు శాస్త్రం ప్రకారం, హనుమంతుని ఫోటోను ఎల్లప్పుడూ దక్షిణ దిశలోనే ఉంచాలి. అది కూడా కూర్చున్న భంగిమలో, ఎరుపు రంగులో ఉండే ఫోటోనే ఉంచాలి. దక్షిణాభిముఖంగా ఉన్న హనుమంతుని చిత్రం మరింత పవిత్రమైనది ఎందుకంటే ఆంజనేయుడు ఈ దిశలోనే తన ప్రభావాన్ని ఎక్కువగా చూపాడని పండితులు చెబుతారు. ఈ దిశలో హనుమంతుని ఫోటో పెట్టడం వల్ల దుష్టశక్తులన్నీ తొలగిపోతాయట. మీ ఇంట్లో ఆనందం, ఐశ్వర్యం పెరుగుతాయి. మీ ఇంట్లో ఉండే హనుమంతుని ఫోటోలో ఆంజనేయుడు ఉత్తరం వైపు చూస్తున్నట్టు ఉండేలా చూసుకోవాలి. ఉత్తరముఖి హనుమంతుని రూపంలో ఉండే ఈ రూపాన్ని పూజించడం వల్ల సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది. లక్ష్మీదేవి కూడా సంతోషిస్తుంది.


వాస్తు ప్రకారం, పంచముఖి హనుమంతుని ఫోటో ఉండే ఇంట్లో ఆటంకాలన్నీ తొలగిపోతాయి. సంపద కూడా పెరుగుతుంది. మీ కుటుంబంలోని ఆటంకాలు, వ్యాధులు వంటివి దూరమవుతాయి. శత్రువుల బాధ తొలగిపోతుంది. పంచముఖి హనుమంతుని ఫోటోను ఇంట్లోని ప్రధాన ద్వారం పైన ఉంచొచ్చు లేదా అందరికీ కనిపించే ప్రదేశంలో పెట్టొచ్చు. ఇలా చేయడం వల్ల ఎలాంటి దుష్టశక్తులు ఇంట్లోకి ప్రవేశించవు.మీ ఇంటికి అతిథులు వచ్చి కూర్చునే గదిలో శ్రీరాముడిని నమస్కరిస్తున్న ఫోటోను ఉంచాలి. ఈ చిత్రంలో చూపినట్టు శ్రీరాముని పాదాల దగ్గర హనుమంతుడు కూర్చున్న ఫోటోను ఉంచాలి లేదా శ్రీరాముని భజన చేస్తున్న హనుమంతుని ఫోటో ఉంచొచ్చు. ఇలా చేయడం వల్ల మీ జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయి.

మీ ఇంట్లో హనుమంతుని ఫోటోలో పర్వతాన్ని ఎత్తుకెళ్తున్నట్టు ఉండే ఫోటోను ఉంచడం వల్ల ధైర్యం, బలం, విశ్వాసం, బాధ్యతాయుతమైన భావాన్ని పెంపొందించుకుంటారు. ఈ భంగిమలోని ఫోటో వల్ల ఎలాంటి పరిస్థితులు ఎదురైనా అస్సలు భయపడరు. ఎంత పెద్ద సమస్యలకైనా పరిష్కారం కనుగొంటారు. వీర హనుమంతుని పూజించడం ద్వారా భక్తుల ధైర్యం కూడా పెరుగుతుంది.మీ ఇంట్లో ఉండే హనుమంతుని ఫోటోలో శ్రీరాముని భజన చేస్తున్న భంగిలో ఉంటే.. మీకు భక్తి, విశ్వాసం పట్ల ఆసక్తి పెరుగుతుంది. వీటి కారణంగా మీరు జీవితంలో విజయాలను సాధిస్తారు. అంతేకాదు మీకు ఏకాగ్రత శక్తి కూడా పెరుగుతుంది.


Related News

Vastu Tips: పేదరికం నుంచి బయటపడాలంటే.. తప్పక పాటించాల్సిన వాస్తు చిట్కాలివే !

Karthika Masam 2025: కార్తీక మాసం చివరి రోజు.. ఇలా దీపదానం చేస్తే జన్మజన్మల పుణ్యం

Vastu Tips: ఉదయం లేవగానే.. ఈ వస్తువులు చూస్తే సమస్యలు కోరి కోని తెచ్చుకున్నట్లే ?

Vastu Tips: ఇంట్లో పొరపాటున కూడా.. ఈ దిశలో మొక్కలు పెట్టకూడదు !

Nandi in Shiva temple: శివాలయాల్లో నంది చెవిలోనే మన కోరికలు ఎందుకు చెప్పాలి?

Incense Sticks: పూజ చేసేటప్పుడు.. ఎన్ని అగరబత్తులు వెలిగించాలో తెలుసా ?

Vishnu Katha: మీ ఇంట్లోనే మహావిష్ణువు లక్ష్మీదేవితో కొలువుండాలంటే ఈ కథ చదవండి

Karthika Masam 2025: కార్తీక మాసం చివరి సోమవారం.. ఇలా పూజ చేస్తే శివయ్య అనుగ్రహం

Big Stories

×