దేశీయ ఆటో మోబైల్ దిగ్గజం టాటా మోటార్స్ సరికొత్త టాటా సియెర్రా SUVని త్వరలో ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లలోకి అందుబాటులోకి తీసుకురానుంది. ఎప్పుడెప్పుడు ఈ కారు అందుబాటులోకి వస్తున్న టాటా అభిమానులకు, కంపెనీ సర్ ప్రైజ్ ఇచ్చింది. ఓ వైపు ఈ నెల 25న మార్కెట్లలోకి తీసుకొస్తుండగా, అంతకు ముందే అధికారికంగా విడుదల చేసింది. కొత్త టాటా సియెర్రా SUV అదిరిపోయే డిజైన్, అధునాతన ఇంటీరియర్స్, మల్టీఫుల్ పవర్ ట్రెయిన్ ఆప్షన్లతో క్లాసిక్ కారుగా అందుబాటులోకి ముస్తాబైంది. కార్ లవర్స్ ను క్రేజీగా ఆకట్టుకుంటుంది.
2025 టాటా సియెర్రా పూర్తిగా లేటెస్ట్ అందాలను అద్దుకుంది. ఈ కారు ముందు భాగంలో సన్నని హెడ్ ల్యాంప్ యూనిట్లతో కూడిన LED లైట్ బార్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. సియెర్రా బ్యాడ్జ్, బోల్డ్ సిల్వర్ స్కిడ్ ప్లేట్ తో కూడిన డార్క్ కలర్ గ్రిల్ ను కలిగి ఉంది. సైడ్ లో టాటా ఐదు డోర్ల లేఅవుట్ ను తీసుకొచ్చింది. ఇది క్లాసిక్ త్రీ డోర్ ఫార్మాట్ కు భిన్నంగా, ప్రస్తుత కొనుగోలుదారులకు అనుగుణంగా రూపొందించింది. SUV ఫ్లష్ ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, పెద్ద గ్లాస్ హౌస్, గ్లోస్ బ్లాక్ వీల్ ఆర్చ్ క్లాడింగ్ మోడ్రన్ లుక్ ను అందిస్తున్నాయి. 19 ఇంచుల పెద్ద మల్టీ స్పోక్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ స్టైలిష్ లుక్ ను తీసుకొచ్చింది. టాటా రూఫ్, సి పిల్లర్ ను కాంట్రాస్టింగ్ బ్లాక్ లో కంప్లీట్ చేయడం ద్వారా.. ఒరిజినల్ సియెర్రా బ్యాక్ విండో డిజైన్ కు గుడ్ బై చెప్పినట్లు అయ్యింది. ఇక వెనుక భాగంలో కొత్త సియెర్రా పూర్తి వెడల్పు LED టెయిల్ లైట్ బార్, డ్యూయల్ టోన్ బంపర్ తో చూసేందుకు ఆకట్టుకునేలా ఉంది.
కొత్త సియెర్రా ఇప్పటి వరకు టాటా తయారు చేసిన అత్యంత అధునాతన ఇంటీరియర్ లలో ఒకదానిగా గుర్తింపు తెచ్చుకోనుంది. డాష్ బోర్డ్ లో మూడు 12.3 ఇంచులన డిస్ ప్లేలను కలిగి ఉంటుంది. ఇందులో ఒకటి డ్రైవర్ కు, మరొకటి ఇన్ఫోటైన్‌మెంట్, ఇంకొకటి ఫ్రంట్ ప్యాసింజర్ కోసం డిజైన్ చేశారు. ఇది హైటెక్, సీమ్ లెస్ లే అవుట్ ను కలిగి ఉంటుంది. సెంటర్ కన్సోల్ లేటెస్ట్ హారియర్ లో మాదిరిగా ఉంటుంది. ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, రోటరీ గేర్ సెలెక్టర్, వైర్ లెస్ ఛార్జింగ్ ప్యాడ్‌ను కలిగి ఉంటుంది. కంఫర్ట్ ఫీచర్లలో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్ రూఫ్, వైర్ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ ఉన్నాయి.
కొత్త సియెర్రా బోనెట్ కింద రెండు ఇంటర్నల్ కంబూషన్ ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి. 160 bhp, 280 Nm టార్క్ ఉత్పత్తి చేసే 1.5-లీటర్ టర్బో-పెట్రోల్, 170 PS, 350 Nm టార్క్ ఉత్పత్తి చేసే 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్లతో వస్తుంది. ఈ రెండు ఇంజన్లు మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్లను కలిగి ఉంటాయి. మొత్తంగా సియెర్రా డిజైన్, ఫీచర్ రిచ్ క్యాబిన్, మల్టీపుల్ పవర్ ట్రెయిన్ ఆప్షన్స్ తో కొత్త సియెర్రా ప్రీమియం SUV విభాగంలో టాటా మోటార్స్ మరింత దుమ్మురేపే అవకాశం కనిపిస్తోంది. అయితే, ఈ లేటెస్ట్ కారు ధర ఎంత అనేది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
Read Also: నెట్ వర్క్ లేకున్నా అవి చూసేయొచ్చు, ఆపిల్ యూజర్లకు పండగే పండుగ!