BigTV English
Advertisement

Rashid Khan : రెండో పెళ్లి చేసుకున్న రషీద్ ఖాన్.. అమ్మాయి కుందనపు బొమ్మలా ఉందిగా!

Rashid Khan : రెండో పెళ్లి చేసుకున్న రషీద్ ఖాన్.. అమ్మాయి కుందనపు బొమ్మలా ఉందిగా!

Rashid Khan :  అప్గానిస్తాన్ క్రికెట‌ర్ ర‌షీద్ ఖాన్ గురించి దాదాపు అంద‌రికీ తెలిసే ఉంటుంది. ఐపీఎల్ లో కూడా అత‌ను స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ త‌ర‌పున కీల‌క ఆట‌గాడిగా మారాడు. ప్ర‌స్తుతం గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్టులో కొన‌సాగుతున్నాడు.తాజాగా ఈ అప్గానిస్తాన్ క్రికెట‌ర్ ర‌షీద్ ఖాన్ గురించి సోష‌ల్ మీడియాలో ఓ వార్త వైర‌ల్ అవుతోంది. అదేంటంటే..? ఇటీవ‌లే ర‌షీద్ ఖాన్ రెండో వివాహం చేసుకున్నట్టు స‌మాచారం. వాస్త‌వానికి ర‌షీద్ ఖాన్ కి మొద‌టి వివాహం 2024లో జ‌రిగింది. రెండో పెళ్లి ఈ ఏడాది ఆగ‌స్టునెల‌లో జ‌రిగిన‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి.


Also Read : Shreyas Iyer: పాపం శ్రేయాస్‌ అయ్య‌ర్‌.. టీమిండియాకు మరో ఊహించని ఎదురు దెబ్బ

సోష‌ల్ మీడియాలో ర‌షీద్ ఖాన్ రెండో పెళ్లి వైర‌ల్

ర‌షీద్ ఖాన్ కి తొలి వివాహం త‌న త‌ల్లి బంధువుతోనే జ‌రిగింది. అప్ప‌ట్లో ర‌షీద్ ఖాన్ పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాని షేక్ చేశాయి. ప్ర‌స్తుతం రెండో వివాహానికి సంబంధించిన ఫొటోలు మాత్రం అంత‌కు మించి వైర‌ల్ అవుతుండ‌టం విశేషం. అభిమానులు ర‌షీద్ ఖాన్ కి శుభాకాంక్ష‌లు చెబుతున్నారు. మ‌రికొంద‌రూ మాత్రం రెండు పెళ్లిళ్లు ఏంట‌ని..? ప్ర‌శ్నించ‌డం గ‌మ‌నార్హం. అక్టోబ‌ర్ 03, 2024లో ర‌షీద్ ఖాన్ కి తొలి వివాహం జ‌రిగింది. కాబూల్ లోని ఇంపీరియ‌ల్ కాంటినెంట‌ల్ హోట‌ల్ లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన విష‌యం తెలిసిందే. అప్ప‌ట్లో ర‌షీద్ ఖాన్ పెళ్లికి సంబంధించిన ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు. ర‌షీద్ ఖాన్ పెళ్లి జ‌రిగిన స‌మ‌యంలో ప్ర‌ధానంగా ర‌షీద్ తో పాటు అత‌ని ముగ్గురు సోద‌రులు అమీర్ ఖ‌లీల్, జ‌కియుల్లా, ర‌జా ఖాన్ కూడా ఒకేసారి పెళ్లి చేసుకోవ‌డం విశేషం. అప్గాన్ స్టార్ స్పిన్న‌ర్ అప్గానిస్తాన్ తో పాటు ప‌లు ఫ్రాంచైజీ జ‌ట్లకు ఆడుతున్నాడు.


ర‌షీద్ కెరీర్ ప్రారంభం అప్పుడే..?

అక్టోబర్ 18, 2015న అఫ్గానిస్తాన్ తరపున వన్డే ఇంటర్నేషనల్ (ODI) మ్యాచ్‌తో తన కెరీర్‌ను ప్రారంభించాడు రషీద్ ఖాన్. అక్టోబర్ 26, 2015న జింబాబ్వేపై T20Iలలో అరంగేట్రం చేశాడు. మార్చి 10, 2017న ఐర్లాండ్‌తో జరిగిన T20Iలో తన తొలి T20Iలో ఐదు వికెట్లు పడగొట్టాడు. ODIలలో 7 వికెట్లు తీసిన మొట్టమొదటి అసోసియేట్ దేశం ఆటగాడిగా నిలిచాడు. టెస్ట్ మ్యాచ్‌లలో 5, 10 వికెట్లు తీసిన మొదటి ఆఫ్ఘన్ బౌలర్‌గా నిలిచాడు. T20లలో 650 వికెట్లు తీసిన మొదటి బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. T20లలో అత్యధిక వికెట్లు సాధించిన రికార్డును కలిగి ఉన్నాడు. T20లలో 4 హ్యాట్రిక్‌లు సాధించాడు, ఇది ఏ బౌలర్‌కైనా అత్యధికం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో గుజరాత్ టైటాన్స్, ఆస్ట్రేలియన్ బిగ్ బాష్ లీగ్ (BBL)లో అడిలైడ్ స్ట్రైకర్స్, పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)లో లాహోర్ ఖలాండర్స్ వంటి అనేక లీగ్‌లలో ఆడాడు. IPLలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున తన ప్రయాణాన్ని ప్రారంభించి, 2022లో గుజరాత్ టైటాన్స్‌కు మారాడు మరియు వారిని టైటిల్ విజేతగా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించాడు.

Also Read : Harmanpreet Kaur: బికినీలో టీమిండియా కెప్టెన్‌..ఆమెతోనే స‌హ‌జీవ‌నం అంటూ ట్రోలింగ్ ?

Related News

Shreyas Iyer: పాపం శ్రేయాస్‌ అయ్య‌ర్‌.. టీమిండియాకు మరో ఊహించని ఎదురు దెబ్బ

Harmanpreet Kaur: బికినీలో టీమిండియా కెప్టెన్‌..ఆమెతోనే స‌హ‌జీవ‌నం అంటూ ట్రోలింగ్ ?

Sanju Samson: సంజు పుట్టిన రోజు..అగ్గిరాజేసిన CSK ట్వీట్‌..అత‌ని వ‌ల్ల జ‌ట్టుకు ఉప‌యోగం ఏంటంటే

Richa Ghosh: మమతా అంటే మాములుగా ఉండ‌దు..రిచా ఘోష్ పేరుతో స్టేడియం, డీఎస్పీ ప‌ద‌వి

Shreyas Iyer: మ‌గాడంటే వాడే, శ్రేయాస్ అయ్య‌ర్ కు పెళ్లాన్ని అయిపోతా..హీరోయిన్ సంచ‌ల‌నం !

Shreyas Iyer: చావు దాక వెళ్లి వ‌చ్చాడు, ఇప్పుడు బీకినీ పాప‌ల‌తో బీచ్ లో ఎంజాయ్ !

IPL 2026: SRH నుంచి ట్రావిస్ హెడ్ ఔట్‌…రంగంలోకి రోహిత్ శ‌ర్మ‌..కావ్య పాప ప్లాన్ అదుర్స్ ?

Big Stories

×