Body Spray: ప్రస్తుతం చాలామంది పార్టీ ఆయినా.. ఫంక్షన్ అయినా.. ఆఫీసుకి వెళ్లాలన్నా.. కాలేజీకి వెళ్లాలన్నా బాడీ స్ప్రే లేకుండా బయటకి అడుగు కూడా పెట్టడం లేదు. అంతలా పెర్‌ఫ్యూమ్స్ పాపులర్ అయ్యాయి. వీటిని ముఖ్యంగా చెమట నుంచి వచ్చే దుర్వాసనను తప్పించుకోవడానికి కొందరు, మంచి సువాసన కోపం మరికొందరు వాడుతుంటారు. వీరిలో గంట గంటకూ వాడేవాళ్లూ లేకపోలేదు. అయితే, బాడీ స్ప్రేలను అతిగా వాడితే.. వాటిలోని రసాయనాల కారణంగా చర్మ సంబంధిత సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో బాడీ స్ప్రేలను అతిగా ఉపయోగించడం వల్ల తలెత్తు సమస్యలేంటో మనమూ తెలుసుకుందాం.
చాలామంది బాడీ స్ప్రేలను ఎక్కువగా అండర్ ఆర్మ్స్‌లో కొడుతుంటారు. ఇది ఆడవారిలో వక్షోజాలకి దగ్గరి ప్రాంతం. కాబట్టి ఆ స్ప్రే బ్రెస్ట్ టిష్యూలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ రకంగా కొన్నిసార్లు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరిగిపోతుంది.
సువాసనలు వెదజల్లడానికి పెర్ఫ్యూమ్స్ తయారీలో రకరకాల కెమికల్స్ వాడతారు. వీటి తయారిలో ట్రైక్లోసన్ అనే పెస్టిసైడ్ కూడా ఉపయోగిస్తారు. ఇది ఏరకంగానూ మీ చర్మ ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు నిపుణులు.
ప్రస్తుత జనరేషన్‌లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ అందరూ పెర్ఫూమ్స్ ఉపయోగిస్తున్నారు. అయితే, ఈ స్ప్రేలలో పరాబెన్స్, పథలేట్స్ అనే పదార్థాలు ఉంటాయి. వీటిని బాలికలు వాడితే త్వరగా రజస్వల అయ్యే అవకాశం ఉంటుంది.
గర్భం దాల్చిన మహిళలు పెర్ఫ్యూమ్స్ బాటిల్స్‌పై మక్కువ చూపిస్తే అది బిడ్డకే ప్రమాదం. ఈ స్ప్రే వల్ల ప్రాణాపాయ స్థితి ఉన్నా లేకున్నా, బిడ్డ ఏదో ఒక లోపంతో పుట్టే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే.. ఈ బాడీ స్ప్రేలో ఎక్కువగా ఎథనాల్ కంటెంట్ ఉంటుంది. ఇది చర్మాన్ని పొడిగా మారుస్తుంది.
మార్కెట్లో విక్రయించే చాలా సెంటు బాటిళ్లలో అల్యూమినియం డిరైవెటివ్స్ ఉంటున్నాయి. ఈ కారణంగా త్వరగా మతిమరుపు వచ్చే అవకాశం ఉంటుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే, కొన్ని బాడీ స్ప్రైల వల్ల బట్టలకు మరకలు అంటుకుంటాయి. అవి త్వరగా పోవు కూడా. దీనివల్ల కొంతమందికి తల నొప్పి, అలెర్జీలు కూడా వస్తాయి.