Big Stories

KOLHAPUR MAHALAKSHMI TEMPLE : ప్రళయంలోను చెక్కు చెదరని ఆలయం

KOLHAPUR MAHALAKSHMI TEMPLE :- పంచగంగా నది ఒడ్డున ఉన్న కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. కొన్ని వందల నాటి ఈ నగరం కొల్హాసురుడనే రాక్షసుడి పేరు మీద ఈ నగరం వెలిసింది. సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఉంది. ఈ ప్రాంతాన్నీ కర్వీర్ గా చెబుతుంటారు. ఆ మహా దంపతులకు ఇష్టమైన ప్రదేశమిది. ఈ క్షేత్రాన్ని అవిముక్తేశ్వర క్షేత్రం అని కూడా అంటారు.

- Advertisement -

కొల్హాపూర్ దేవాలయాన్ని క్రీస్తు శకం ఏడో దశాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన చాళుక్య రాజు కరణ్ దేవ్ కట్టించారు. పురాణాల్లో తెలిపిన 108 శక్తి క్షేత్రాల్లో ఒకటి కరివీర ప్రాంతం. ఎన్నో వేల సంవత్సరాల నుంచి మహర్షులు, రుషులు ఇక్కడ పూజలు చేసినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. ఒక్క రాత్రిలోనే అమ్మవారు ఈ గుడిని నిర్మించారని పురాణాలు చెబుతున్నాయి.

- Advertisement -

అరుదైన శిలపై అమ్మవారి విగ్రహం ఉంటుంది. నాలుగు హస్తాలు కలిగి భకత్లును దీవిస్తున్న రూపం ఆకట్టుకుంటుంది. ఫలం, కవచం, పాత్ర, గదను నాలుగు చేతులతో ఉన్న అమ్మవారి దివ్యమంగళరూపం ఆశీర్వచనాలు ఇస్తుంటుంది.
భృగువు పాదంలోని కన్నును లౌక్యంగా తీసేసి రుషి గర్వాన్ని అణచివేశాడు మహావిష్ణువు. తర్వాత అమ్మవారి కోసం అన్వేషిస్తూ తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుడిగా అవతరించినట్టు పురాణాలు చెబుతున్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News