After Brushing:ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే బ్రష్ చేసుకుంటాం. దీంతో రోజంతా దంతాలతో పాటు నోరు ఆరోగ్యంగా ఉంటుంది. దంతాలను సరిగా శుభ్రం చేసుకోకపోతే చిగుళ్ల సమస్యలతో పాటు గుండెజబ్బులు, డయాబెటిస్‌లాంటి దీర్ఘకాలిక సమస్యలు వస్తాయి. అందుకే నోరు ఆరోగ్యంగా ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతారు. పళ్లను శుభ్రంగా తోమడం వల్ల నోటిలోని బ్యాక్టీరియా, సూక్ష్మక్రిములను కడుపులోకి వెళ్లకుండా అడ్డుకోవచ్చు.
దంతాలను శుభ్రం చేసుకోవడానికి హార్డ్ బ్రష్ ముఖ్యం. మరీ హార్డ్ కాకుండా మృధువైనవి కాకుండా ఉండేవాటిని వాడాలి. ఎక్కువసేపు పళ్లు తోమకూడదు. దీని వల్ల పళ్లపై ఎనామిల్ తొలిగిపోయి సున్నితంగా మారుతాయి. అందుకే 2 నిమిషాలే బ్రష్ చేయాలి. హార్డ్ బ్రిజల్స్ ఉన్న బ్రష్‌లను వాడితే పళ్లు బాగా మెరుస్తాయని అనుకుంటారు. అయితే కఠినమైన బ్రిజల్స్ దంతాలు, చిగుళ్లకు గాయాలు చేస్తాయి. దంతాలపై ఉండే ఎనామిల్ పోయేలా చేసి దుష్ప్రభావాలు కలుగుతాయి. చాలా మంది ఆహారం తీసుకున్న తర్వాత దంతాలను శుభ్రం చేసుకుంటారు. నోటిలోని లాలాజలం మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అలాగే నోటిలో బ్యాక్టీరియా, సూక్ష్మక్రిముల నుంచి రక్షిస్తుంది. ఆహారం తీసుకున్న తర్వాత పళ్లు తోమడం వల్ల ఈ ప్రభావం తగ్గిపోతుంది. అందుకే భోజనం చేసిన తర్వాత కనీసం 30 నిమిషాలు వేచి ఉండాలని వైద్యులు అంటున్నారు. చాలా మంది బ్రష్‌లను ఏళ్ల తరబడి వాడుతుంటారు. అయితే 3 నెలలకు ఒకసారి బ్రష్‌లను మార్చడం చాలా మంచిదని దంత వైద్యులు చెబుతున్నారు. బ్రిజల్స్ వంగిపోయి కనిపించగానే బ్రష్ మార్చాలని అంటున్నారు.