Kakinada Crime News: అమ్మాయి వయస్సు 17.. అబ్బాయి వయస్సు 19 ఏళ్లు. ఇద్దరిదీ ఒకటే జిల్లా.. ఒకటే మండలం. చివరికి ఒకటే గ్రామం కూడా. చిన్ననాటి నుంచి ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. కానీ యువతి పేరెంట్స్ ససేమిరా అన్నారు. తనకు దక్కని ఎవరికీ దక్కకూడదని భావించాడు. బాలికను తన వాహనంలో తీసుకెళ్లి పదునైన బ్లేడ్‌తో గొంతు కోసి చంపేశాడు. ఆ యువకుడు రైలు కింద ఆత్మహత్య చేసుకున్నాడు. సంచలనం రేపిన ఈ ఘటన కాకినాడ జిల్లాలో వెలుగుచూసింది.
కాకినాడలో దారుణం..
ఈ మధ్యకాలంలో ప్రేమ పేరుతో యువతీయువకులు హత్యలు, ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు పెరుగుతున్నాయి. కారణాలు ఏమైనా కావచ్చు.. విలువైన జీవితాలకు చిన్న వయస్సులో కోల్పోతున్నారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలతో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. చివరకు తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగుల్చుతున్నారు.
గొల్లప్రోలు మండలం దుర్గాడకు చెందిన 17 ఏళ్ల దీప్తి కాకినాడలో ఇంటర్ చదువుతోంది. ఆ గ్రామానికి చెందిన 19 ఏళ్ల అశోక్ పాలిటెక్నిక్ చదివాడు. ఓ కంపెనీలో ఉద్యోగం కోసం 20 రోజుల కిందట చెన్నై వెళ్లాడు. అయితే సొంత గ్రామానికి చెందిన దీప్తిని ప్రేమిస్తున్నానని తన ఫ్రెండ్స్‌తో వీలు చిక్కినప్పుడల్లా చెప్పుకునేవాడు. ఈ విషయం అమ్మాయి ఇంట్లో తెలియడంతో అశోక్‌ని గట్టిగా మందలించారు.
టీనేజ్ యువతిని బయటకు తీసుకెళ్లి
దసరా సెలవుల నిమిత్తం రెండు రోజుల కిందట దీప్తి కాకినాడ టౌన్‌లో చుట్టాల ఇంటికి వెళ్లింది. మంగళవారం యువతి వద్దకు వెళ్లాడు అశోక్. బయటకు వెళ్దామని చెప్పి దీప్తిని బయటకు తన టూవీలర్‌పై తీసుకెళ్లాడు. పనసపాడులోని గాడేరు కాలువ గట్టు వద్దకు వెళ్లారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలీదు. తనతో తెచ్చుకున్న బ్లేడుతో యువతి గొంతు కోసి చంపేశాడు.
ALSO READ: ఖమ్మంలో ఘోర ప్రమాదం.. వెలుగులోకి షాకింగ్ దృశ్యాలు
అక్కడి నుంచి నేరుగా హుస్సేన్‌పురం సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం పోలీసుల దృష్టికి వచ్చింది. బాలిక మృతి చెందిన ప్రాంతంలో లభ్యమైన టోపీ ఆధారంగా అశోక్ హత్య చేశాడని అంచనాకు వచ్చారు. రైల్వే పట్టాల సమీపంలో దొరికిన వాహనం నెంబర్ ప్లేటు ఆధారంగా మృతుడు అశోక్ అని తేలింది. ఇద్దరు ఒకే గ్రామానికి చెందినవారని తేలింది.
దర్యాప్తు చేపట్టగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం వారి ఫోన్ కాల్‌డేటాపై దృష్టి పెట్టారు.యువతి బంధువుల ఫిర్యాదుల కేసు నమోదు చేశారు. అశోక్ ఆత్మహత్యకు ముందు ఐయాం సారీ.. ఐ లవ్ యూ సో మచ్ నాన్నా.. వదిలివెళ్లిపోతున్నానని తండ్రికి మెసేజ్ పంపించాడు. అలాగే దగ్గర బంధువుకు ఫోన్ చేసి తాను చనిపోతున్నట్లు చెప్పి ఫోన్ స్విచ్ఛాప్ చేసినట్టు తెలుస్తోంది.