Nayanthara: సౌత్ లేడీ సూపర్ స్టార్ గా పేరు సొంతం చేసుకుంది నయనతార (Nayanthara). తెలుగు, తమిళ్, హిందీ అంటూ భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ భారీ పాపులారిటీ సంపాదించుకుంది. అంతేకాదు సౌత్ సినీ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా కూడా పేరు దక్కించుకుంది నయనతార. ఒకప్పుడు ఏడాదికి మూడు నుండి నాలుగు సినిమాలు చేసిన రోజులు కూడా ఉన్నాయి అయితే ఇప్పుడు మాత్రం ఆచితూచి అడుగులు వేస్తోంది ఈ ముద్దుగుమ్మ. అందులో భాగంగానే చాలా తక్కువ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తోంది.
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi ) హీరోగా, ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో వస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో ఈమె శశిరేఖ పాత్ర పోషిస్తున్నట్లు నిన్న ఆయుధ పూజ సందర్భంగా చిత్ర బృందం ఈమె పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.. ఇందులో శశిరేఖ గెటప్ లో నయనతార మరింత అందంగా కనిపిస్తోందని అభిమానులు కూడా కామెంట్లు చేశారు.
దసరా స్పెషల్.. మహాశక్తిగా నయనతార..
ఇదిలా ఉండగా నయనతార నటిస్తున్న మరో చిత్రం మూకుత్తి అమ్మన్ 2. ప్రముఖ డైరెక్టర్ సుందర్ సి(Sundar C) దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం నుండి దసరా సందర్భంగా నయనతార ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని తెలుగులో ‘మహాశక్తి’ పేరిట రిలీజ్ చేస్తున్నామని టైటిల్ రివీల్ తో పాటు అమ్మవారి గెటప్ లో ఉన్న నయనతార ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ముక్కుపుడక అమ్మవారు గెటప్ లో మహాశక్తిగా నయనతార అందరి దృష్టిని ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు.
‘మూకుత్తి అమ్మన్- 2’ సినిమా విశేషాలు..
ఇక ఈ సినిమా విషయానికొస్తే.. గతంలో వచ్చిన ‘మూకుత్తి అమ్మన్’ సినిమా సీక్వెల్ గా ఈ సినిమా రాబోతోంది. ఇందులో నయనతార అమ్మవారిగా, ఆర్జే బాలాజీ కీలకపాత్ర పోషించారు. ముఖ్యంగా మూకుత్తి అమ్మన్ సినిమా విడుదలైనప్పుడు మంచి ఆదరణ పొందింది. ఈ చిత్రానికి ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించారు. కానీ రెండవ భాగం మూకుత్తి అమ్మన్ 2 కి మాత్రం సుందర్ సీ దర్శకత్వం వహిస్తున్నారు. వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ బ్యానర్ తో కలిసి విఘ్నేష్ శివన్ కి చెందిన రౌడీ పిక్చర్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
‘మూకుత్తి అమ్మన్- 2’ సినిమా తారాగణం..
ఇందులో నయనతార, దునియా విజయ్, రెజీనా కసాండ్రా, ఊర్వశి , అభినయ, యోగిబాబు, అజయ్ ఘోష్ , సింగం పులి, విచ్చు విశ్వనాథ్, నందిని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సుమారుగా కోటి రూపాయలతో పూజా కార్యక్రమాలు నిర్వహించగా.. ఇప్పుడు 100 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని నిర్మాత ఇషారి గణేష్ తెలిపారు.. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
ALSO READ:Shilpa Shetty: లుకౌట్ నోటీసుల వేళ విదేశాలకు పయనమైన శిల్పా శెట్టి జంట.. వేటు తప్పదా?