BigTV English

Money Hand : ఇతరులకు డబ్బు ఇచ్చేటప్పుడు ఏ చేతితో ఇస్తున్నారు..?

Money Hand :  ఇతరులకు డబ్బు ఇచ్చేటప్పుడు ఏ చేతితో ఇస్తున్నారు..?

Money Hand : ఈ రోజుల్లో డబ్బులు లేని జీవితం లేదన్న నమ్మకంగా బాగా బలపడిపోయింది. పుట్టుక నుంచి చావా దాకా డబ్బులు లేకుండా ఏదీ జరగని పరిస్థితి. డబ్బు అనేది ప్రతి మనిషి జీవితంలో ఒక


ముఖ్యమైన భాగం. ప్రస్తుత ప్రపంచంలో అసలు ఏ పనీ జరగదు. డబ్బు చేతిలో ఉంటే మనం ఏ పని అయినా చేయవచ్చు. అదొక ధీమా ఉంటుంది. అలాంటి డబ్బును వేరే వాళ్లుకు ఇచ్చే టప్పుడు

కొంతమంది తప్పులు చేస్తుంటారు. ఆ తప్పులే వారికి శాపాలవుతాయి . లక్ష్మీదేవి వారి నుంచి దూరమవుతుంది. అలా అందరికి జరగదు. ఆ చేయకూడని తప్పులేంటో ఓసారి గమనించండి.
కరెన్సీ నోట్లను లెక్కించేటప్పుడు కొందరు నోట్లకు ఉమ్మితో తడి చేస్తుంటారు. ఇలా అసలు చేయరాదు. ఇలా చేస్తే లక్ష్మీదేవిని అవమానించినట్లే అవుతుంది.


కరెనీ నోట్లపై కొందరు ఏవేవో రాస్తుంటారు. ఇలా చేయడం కూడా వాస్తు ప్రకారం మంచిది కాదు. దీని వల్ల ఆర్థిక సమస్యలు వస్తాయి. లక్ష్మీదేవిని అగౌరవపరిచినట్లు అవుతుంది. కాబట్టి నోట్లపై ఏమీ

రాయకూడదు. ఇతరులకు డబ్బులు ఇచ్చేటప్పుడు ఏ కారణం వల్ల ఇచ్చినా సరే సంతోషంగా ఇవ్వాలి. ఏడూస్తూ బాధపడుతూ ఇవ్వడం వల్ల మీకు, అవతల తీసుకున్న వారికి శుభం జరగదు. కష్టపడి

సంపాదించిన సొమ్ము వెళ్లిపోతుంది…మళ్లీ వస్తుందో లేదో..సంపాదిస్తోనో లేదో అనుకుంటూ ఇవ్వకూడదు. జీవితంలో మనం సంపాదిస్తున్న డబ్బు ఖర్చు పెట్టడానికే. అలా ఖర్చు పెడితేనే మళ్లీ

సంపాదించలన్న ఆశ పుడుతుంది. ఆ డబ్బు ఖర్చు వల్ల మనకు ఆనందం కలగాలి. మనం ఎంత ఖర్చుపెడితే అంత మళ్లీ మనకు చేతికి వస్తూ ఉంటుంది. అయితే ఆ పెట్టు ఖర్చు ఎలా ఏవిధంగా

చేస్తున్నామన్నది కూడా చాలా ముఖ్యమన్న సంగతి గుర్తు పెట్టుకోవాలి.

డబ్బు లెక్క పెట్టేటప్పుడు ఒక చేతి నుంచి మరో చేతీతో తీసుకుంటూ లెక్కపెడుతుంటాం. అలా చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. డబ్బులు రివర్స్ లో పట్టుకుని ఒక చేతిలో ఉంటుని రెండో

చేతికి ఇవ్వకుండానే లెక్కపెట్టాలి. ఇచ్చేటప్పుడు ఐదు వేళ్లతో డబ్బులు పట్టుకుని ఇవ్వాలి.నాలుగు వేళ్లు పైన ఉండాలి. బొటన వేలు రెండో వైపు ఉండేలా చూసుకోవాలి. అలా ఇచ్చేటప్పుడు

ముఖంలోను, మనసులోను ఆనందంగా ఉండాలి.

Related News

Vastu Tips: వాస్తు ప్రకారం.. ఇంట్లో డబ్బు ఎక్కడ దాచాలి ?

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Big Stories

×