BigTV English

Hyderabad Crime Rate: హైదరాబాద్‌లో గణనీయంగా తగ్గిన క్రైమ్ రేట్.. పోలీసుల సమిష్టి కృషి ఫలితం

Hyderabad Crime Rate: హైదరాబాద్‌లో గణనీయంగా తగ్గిన క్రైమ్ రేట్.. పోలీసుల సమిష్టి కృషి ఫలితం

Hyderabad Crime Rate: హైదరాబాద్ నగరంలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గినట్టు తాజా గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఈ పురోగతకు నగరంలో పోలీస్ శాఖలోని సమిష్టి, సమన్వయ ప్రయత్నాలు ప్రధాన కారణంగా గుర్తించబడ్డాయి. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ అభినందనలతో కూడిన క్రైమ్ రివ్యూ సమీక్షా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు.


క్రైమ్ రేటులో శాతనిష్పత్తి తగ్గుదల

గత ఏడాదితో పోలిస్తే, ఈ ఏడాది ప్రధాన నేరాల సంఖ్యలో స్పష్టమైన తగ్గుదల కనిపిస్తోంది. ముఖ్యంగా హత్య, హత్యాయత్నం, గాయపరచడం, కిడ్నాప్, సైబర్ క్రైమ్ మరియు రేప్ కేసుల్లో గణనీయమైన తగ్గుదల నమోదయింది.


ప్రధాన నేరాల నమోదు వివరాలు

నేరం- సెప్టెంబర్ 2023 – ఆగస్టు 2024 సెప్టెంబర్ 2024 – ఆగస్టు 2025 తగ్గుదల శాతం

తగ్గుదల శాతం-

హత్య కేసుల్లో 14% తగ్గుదల..

సెప్టెంబర్ 2023 నుండి ఆగస్టు 2024 వరకు 85 హత్య కేసులు..

సెప్టెంబర్ 2024 నుండి ఆగస్టు 2025 వరకు 73 హత్య కేసులు..

హత్యాయత్నం కేసులో 29% తగ్గుదల..

సెప్టెంబర్ 2023 నుండి ఆగస్టు 2024 వరకు 259 హత్యా యత్నం కేసులు..

సెప్టెంబర్ 2024 నుండి ఆగస్ట్ 2025 వరకు185 హత్యాయత్నం కేసులు నమోదు..

గాయపరచడం కేసుల్లో 15% తగ్గుదల..

సెప్టెంబర్2023 నుండి ఆగస్ట్ 2024 వరకు గాయపరచడం 2,409 కేసులు..

సెప్టెంబర్2024 నుండి ఆగస్ట్ 2025 వరకు 2,037 కేసులు నమోదు..

గాయపరచడం కేసుల్లో 15% తగ్గుదల..

కిడ్నాప్ కేసుల్లో 12% తగ్గుదల..

సెప్టెంబర్ 2023 నుండి ఆగస్టు2024 వరకు 698 కిడ్నాప్ కేసులు..

సెప్టెంబర్2024 నుండి ఆగస్టు 2025 వరకు 616 కిడ్నప్ కేసులు నమోదు..

సైబర్ క్రైమ్ కేసులో 14% తగ్గుదల..

సెప్టెంబర్2023 నుండి ఆగస్టు 2024 వరకు 4, 348 సైబర్ క్రైమ్ కేసులు..

సెప్టెంబర్ 2024 నుండి ఆగస్టు 2025 వరకు 3, 745 సైబర్ క్రైమ్ కేసులు నమోదు..

సైబర్ క్రైమ్ నియంత్రణలో పురోగతి

సైబర్ క్రైమ్ నియంత్రణలో హైదరాబాద్ పోలీసులు మంచి ప్రతిభ కనబరిచారు. కేసుల సంఖ్యలో తగ్గుదల మాత్రమే కాకుండా, డిటెక్షన్ రేటు కూడా మెరుగుపడింది. గత ఏడాది 40%గా ఉండే డిటెక్షన్ రేటు ఈ ఏడాది 42%కి పెరిగింది. ఇది సైబర్ నేరాలపై పోలీసుల వేగవంతమైన ప్రతిస్పందనకు దోహదపడింది.

పోలీసుల సమిష్టి కృషి

హైదరాబాద్ నగరంలోని అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సమన్వయంతో, సమిష్టిగా పనిచేయడం వల్ల క్రైమ్ రేటులో ఇది సాధారణం కాకుండా.. గణనీయమైన తగ్గుదల అని అధికారులు పేర్కొన్నారు. రాత్రి పూటలలో, సిటీలోని ముఖ్యమైన ప్రాంతాలలో అధిక పోలీసు.. ఆధునిక సాంకేతిక పరికరాలతో నేరాలను నిరోధించడంలో ప్రభావం చూపుతున్నాయి.

రేప్ కేసుల తగ్గుదల

రేప్ కేసుల్లో 23% తగ్గుదల నమోదు కావడం ముఖ్యమైనదిగా గుర్తించింది. ఇది పోలీసుల చర్యలతో పాటు సమాజంలో మహిళల భద్రతపై మరింత అవగాహన పెరగడాన్ని సూచిస్తుంది. పోలీస్ శాఖ మహిళల భద్రతకు ప్రత్యేక దృష్టి సారిస్తోంది.

Also Read: తిరుమల శ్రీవారి భక్తులకు మరో కానుక

హైదరాబాద్‌లో క్రైమ్ రేటు తగ్గించడం పోలీసుల కృషికి స్పష్టమైన ప్రతిఫలమని పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. ఇది పోలీసింగ్ విధానంలో తీసుకుంటున్న సమన్వయ ప్రయత్నాల ఫలితం. భవిష్యత్తులో కూడా ఈ స్థాయిలో భద్రతను నిలుపుకోవడానికి, నగరంలోని ప్రతి నివాసి సురక్షితంగా జీవించడానికి పోలీసులు నిబద్ధతతో కొనసాగుతారు.

Related News

CM Revanth Reddy: అంబర్ పేట్‌లో సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్.. ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో ఆంక్షలు.. అనుమతి లేనిదే నో ఎంట్రీ

TGPSC Group 2: తెలంగాణ గ్రూప్-2 ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి

CM Revanth Reddy: 10 ఏళ్లు అవకాశం ఇవ్వండి.. ఫ్యూచర్ సిటీ అంటే ఏంటో చూపిస్తా!

Shamshabad Airport: హై అలర్ట్! శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు బాంబు బెదిరింపు

Mother Dairy Election: నల్గొండ కాంగ్రెస్‌లో మదర్ డెయిరీ ఎన్నికల చిచ్చు..

Telangana: ఫ్యూచర్ సిటీకి పునాదిరాయి.. సీఎం రేవంత్ చేతుల మీదుగా శంకుస్థాపన

Big Stories

×