BigTV English

Karthik Varma: ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్న టాలీవుడ్ డైరెక్టర్.. సందడి చేసిన సినీ సెలబ్రిటీలు!

Karthik Varma: ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్న టాలీవుడ్ డైరెక్టర్.. సందడి చేసిన సినీ సెలబ్రిటీలు!

Karthik Varma: టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడుగా కొనసాగుతున్న వారిలో విరూపాక్ష (Virupaksha) సినీ దర్శకుడు కార్తీక్ వర్మ దండు (Karthik Varma Dandu)ఒకరు. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్(Sukumar) వద్ద ఎంతోమంది శిష్యరికం తీసుకొని అనంతరం దర్శకులుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇలా సుకుమార్ శిష్యుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కార్తీక్ వర్మ సాయిధరమ్ తేజ్ (Sai Dharm Tej)హీరోగా విరూపాక్ష అనే సినిమా ద్వారా దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్న కార్తీక్ అనంతరం నాగచైతన్యతో సినిమా చేసే అవకాశాన్ని అందుకున్నారు.


నిశ్చితార్థం జరుపుకున్న కార్తీక్ వర్మ..

ప్రస్తుతం నాగచైతన్య సినిమా పనులలో కార్తీక్ ఎంతో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా దర్శకుడు కార్తీక్ వర్మ హరిత(Haritha) అనే అమ్మాయితో ఎంతో అంగరంగ వైభవంగా హైదరాబాద్లో నేడు నిశ్చితార్థం (Engagment)జరుపుకున్నారు. ఈ నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతున్నాయి. అయితే గతంలో కూడా డైరెక్టర్ కార్తీక్ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి కానీ అవి నిశ్చితార్థపు ఫోటోలు కాదని కేవలం పెళ్లి చూపులకు సంబంధించిన ఫోటోలని తెలుస్తోంది. తాజాగా వీరి నిశ్చితార్థం హైదరాబాద్ లో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.

స్పెషల్ అట్రాక్షన్ గా చైతూ.. శోభిత

ఇక ఈ నిశ్చితార్థపు వేడుకలో భాగంగా పలువురు సినీ సెలబ్రిటీలు కూడా సందడి చేశారు. కార్తీక్ సుకుమార్ శిష్యుడు కావడంతో సుకుమార్ ఈ నిశ్చితార్థపు వేడుకకు హాజరు కాలేకపోయిన ఆయన సతీమణి తబిత హాజరై సందడి చేశారు. అదేవిధంగా మెగా హీరో సాయిధరమ్ తేజ్ సందడి చేశారు. ఇక కార్తీక్ ప్రస్తుతం నాగచైతన్యత సినిమా చేయబోతున్న నేపథ్యంలో నాగచైతన్య(Nagachaitanya) శోభిత (Sobhita)దంపతులు కూడా ఈ నిశ్చితార్థపు వేడుకలో పాల్గొని సందడి చేశారు. ఇక శోభిత చైతు ఈ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. వీరితో పాటు ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ కూడా హాజరయ్యారు.


విరూపాక్ష సినిమాతో సక్సెస్..

ఇలా వీరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. అయితే ఈయన చేసుకోబోయే అమ్మాయి హరిత ఎవరు? బ్యాక్ గ్రౌండ్ ఏంటి అనే విషయాలు మాత్రం తెలియడం లేదు. ఇక దర్శకుడు కార్తీక్ కెరియర్ విషయానికి వస్తే సుకుమార్ దగ్గర శిష్యుడిగా పని చేస్తున్న ఈయన కార్తికేయ సినిమాకు రైటర్ గా పనిచేశారు. అనంతరం భమ్ భోలేనాథ్ అనే సినిమాకు దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ సినిమా మాత్రం పెద్దగా సక్సెస్ అందించలేదు కానీ సాయి ధరమ్ తేజ హీరోగా నటించిన విరూపాక్ష సినిమా మాత్రం కార్తీక్ కు మంచి విజయాన్ని అందించింది. ప్రస్తుతం ఈయన నాగచైతన్య సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.

Also Read: Chiranjeevi: చరణ్ 18 ఏళ్ల సినీ కెరియర్.. తండ్రిగా ఆ క్షణం మర్చిపోలేను.. చిరు ఎమోషనల్ పోస్ట్!

Related News

Upasana Ram Charan : బతుకమ్మ వేడుకల్లో మెగా కోడలు ఉపాసన కొణిదెల, ఏకంగా ఢిల్లీలో కూడా

OG Hungry Cheetah Song : హంగ్రీ చీటా మోత మోగించిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలుసా?

Spirit: ప్రభాస్ కు ఫాదర్ గా మెగాస్టార్, అలా ఎలా సెట్ చేశావ్ వంగా?

Sujeeth: ఓజీ యూనివర్స్ నుంచి మరో అప్డేట్.. పవన్ ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా!

The Raja Saab Business: రాజాసాబ్ బిజినెస్… ఓజీని దాటిస్తుందే?

Chiranjeevi: చరణ్ 18 ఏళ్ల సినీ కెరియర్.. తండ్రిగా ఆ క్షణం మర్చిపోలేను.. చిరు ఎమోషనల్ పోస్ట్!

Akhanda 2 : బాలయ్య అఖండ 2 అప్డేట్… పనిలో పనిగా వారికి థమన్ వార్నింగ్

Big Stories

×