TGPSC Group 2: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ) ఆదివారం గ్రూప్-2 తుది ఫలితాలు విడుదల చేసింది. కమిషన్ వెబ్ సైట్(https://websitenew.tgpsc.gov.in/) లో ఫైనల్ రిజల్ట్స్ జాబితాను ఉంచింది. మొత్తం 783 పోస్టులకు గానూ 782 మందిని ఎంపిక చేసింది. ఒక పోస్టు ఫలితాన్ని టీజీపీఎస్సీ పెండింగ్ లో పెట్టింది. 2022లో గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల కాగా.. 2024 డిసెంబర్ లో పరీక్షలు నిర్వహించింది. ఈ ఏడాది మార్చిలో జనరల్ ర్యాంకుల జాబితాను విడుదల చేసింది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేసిన అనంతరం ఆదివారం తుది ఫలితాలు విడుదల చేసింది.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2024 డిసెంబర్ 15, 16 తేదీల్లో గ్రూప్-II సర్వీసెస్ పరీక్షను నిర్వహించింది. ఈ పరీక్షలకు 2025 మార్చి 11న జనరల్ ర్యాంకింగ్ జాబితా విడుదల చేసింది.
అనంతరం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించింది. ఈ ప్రక్రియ ఆధారంగా, మొత్తం 18 పోస్ట్ కోడ్‌లకు తాత్కాలికంగా ఎంపికైన అభ్యర్థుల హాల్ టికెట్ నంబర్లను కమిషన్ వెబ్‌సైట్
https://www.tgpsc.gov.in లో సెప్టెంబర్ 28న విడుదల చేసింది. కోర్టులో పెండింగ్ లో ఉన్న వివిధ పిటిషన్ల ఆధారంగా ఫలితాలను విడుదల చేసినట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది.
అయితే అభ్యర్థి తప్పుడు సమాచారం అందించినట్లు కమిషన్ ఏ దశలో గుర్తించినా ఆ నియామకాన్ని ఏ దశలోనైనా రద్దు చేస్తామని కమిషన్ తెలిపింది.
1. టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ లింక్ https://websitenew.tgpsc.gov.in/ పై క్లిక్ చేయండి.
2. హోమ్ పేజీలోని TGPSC గ్రూప్-2 ఫలితం 2025 తాత్కాలిక జాబితా లింక్‌పై క్లిక్ చేయండి.
3. అనంతరం పీడీఎఫ్ ఓపెన్ అవుతుంది.
4. ఈ PDFలో అభ్యర్థులు తమ రోల్ నంబర్‌ను చెక్ చేసుకోవచ్చు.
5. తదుపరి అవసరాల కోసం PDF ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, హార్డ్ కాపీని ప్రింట్ తీసుకోండి.
Also Read: CM Revanth Reddy: 10 ఏళ్లు అవకాశం ఇవ్వండి.. ఫ్యూచర్ సిటీ అంటే ఏంటో చూపిస్తా!