Sujeeth: ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా “ఓజి”సినిమా(OG Movie) పేరు వినపడుతోంది. పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా సుజీత్(Sujeeth) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అభిమానులను పెద్ద ఎత్తున ఆకట్టుకోవడమే కాకుండా భారీ స్థాయిలో కలెక్షన్లను కూడా రాబడుతుంది. ఇక ఈ సినిమా క్లైమాక్స్ చూస్తే మాత్రం ఖచ్చితంగా సీక్వెల్ కూడా ఉండబోతుందని చిత్ర బృందం చెప్పకనే చెప్పేశారు. ఇక ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ రావడంతో చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ సుజిత్ సైతం వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన ఓజీ యూనివర్స్(OG Universe) గురించి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ఓజీ యూనివర్స్ కేవలం సీక్వెల్ మాత్రమే కాదు ఫ్రీక్వెల్ కూడా రాబోతుందని తెలియజేశారు. ఈ రెండు సినిమాలు ఒకేసారి షూటింగ్ పనులను జరుపుకుంటాయని అయితే ఒక సినిమా విడుదల తరువాత మరొక సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది అంటూ ఈ సందర్భంగా డైరెక్టర్ సుజిత్ ఒక ఇంటర్వ్యూ సందర్భంగా చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమా షూటింగ్ పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయి ఏంటి అనే విషయాలు తెలియాల్సి ఉంది.
ఇకపోతే డైరెక్టర్ సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఈయన ఏఏ హీరోలను భాగం చేయబోతున్నారనే విషయాలు తెలియాల్సి ఉంది. ఇక ఓజీ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీ ఎన్నో అంచనాలు నడుమ విడుదలయ్యింది. ఈ సినిమాకు పవన్ కెరియర్ లో ఏ సినిమాకు రాని విధంగా ఓపెనింగ్స్ రావడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా విడుదలైన నాలుగు రోజులలోనే 200 కోట్ల క్లబ్ లో చేరడంతో అభిమానులు కూడా ఖుషీ అవుతున్నారు.
సంతోషంలో పవన్ ఫ్యాన్స్..
ఇక ఇటీవల కాలంలో సోలో హీరోగా పవన్ కళ్యాణ్ ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ కొట్టి చాలా సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో అభిమానులు కూడా సరైన హిట్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. పవన్ కళ్యాణ్ గతంలో వకీల్ సాబ్ సినిమాలో సోలో హీరోగా నటించిన మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా తర్వాత ఈయన పలు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ అనుకున్న స్థాయిలో సక్సెస్ మాత్రం అందుకోలేకపోయాయి. ఇక ఓజీ సినిమాను ప్రకటించినప్పటి నుంచి అభిమానులలో ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే సినిమా కూడా ఉండడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి అయిందని తెలుస్తుంది. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: Karthik Varma: ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్న టాలీవుడ్ డైరెక్టర్.. సందడి చేసిన సినీ సెలబ్రిటీలు!