E-Paper
Advertisement

Manjima Mohan: హీరోతో లవ్‌లో ఉన్న నాగ చైతన్య హీరోయిన్.. క్లారిటీ ఇచ్చేసింది

Manjima Mohan: హీరోతో లవ్‌లో ఉన్న నాగ చైతన్య హీరోయిన్.. క్లారిటీ ఇచ్చేసింది
Advertisement

‘సాహసం శ్వాసగా సాగిపో’ అనే చిత్రంలో నాగ చైతన్య పక్కన జోడీ కట్టిన బొద్దు గుమ్మ..మలయాళీ ముద్దు గుమ్మ మంజిమ మోహన్‌ని అంత త్వరగా ఎవరూ మరపోలేరు. ఆ తర్వాత ఎందుకనో అమ్మడుకి తెలుగులో ఎక్కువ అవకాశాలు రాలేదు. ఎన్టీఆర్ బయోపిక్‌లో ఎన్టీఆర్ కుమార్తె పాత్రలో నటించింది. తర్వాత ఎక్కువగా తమిళ సినిమాలకే పరిమితం అయ్యింది. ఈ మధ్యన మంజిమ మోహన్ కోలీవుడ్ హీరో గౌతమ్ కార్తీక్‌తో ప్రేమలో ఉందంటూ వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. ఎట్టకేలకు ఈ ప్రేమ జంట తమ ప్రేమ వ్యవహారాన్ని బహిర్గతం చేసింది. తామిద్దరం ప్రేమలో ఉన్నామంటూ మంజిమ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా విషయాన్ని తెలియజేసింది.

‘‘మూడేళ్లు ముందు నా జీవితంలో నన్ను నేను మిస్ అయ్యాను. ఆ సమయంలో నువ్వు సంరక్షక దూతలా వచ్చావు. జీవితంపై నా ఆలోచనను మార్చావు, నాకు సాయం చేశావు. నేను గందరగోళంలో ఉన్న ప్రతీసారి నువ్వు నన్ను అందులో నుంచి బయట పడేశావు. నా తప్పులను అంగీకరించేలా చేసి నన్ను నాలా ఉండేలా నేర్పించావు. నువ్వు నన్ను ప్రేమించే తీరు చూసి నేను నీతో ప్రేమలో పడిపోయాను. నువ్వు నా జీవితంలో ఎప్పటికీ ఫేవరేట్’’ అంటూ మంజిమ మోహన్ తన మనసులోని ప్రేమలో తెలియజేసింది.

Advertisement

సీనియర్ నటుడు, సీతాకోక చిలుక ఫేమ్ కార్తీక్ తనయుడే గౌతమ్ కార్తీక్. ఇతనితో దేవరాట్టం అనే సినిమాలో మంజిమ మోహన్ నటించింది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుంది.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×