Emergency Numbers: అత్యవసర పరిస్థితులు ఎప్పుడు వస్తాయో ముందే ఊహించడం కష్టం. రోడ్డు ప్రమాదం, హార్ట్ అటాక్, అగ్ని ప్రమాదం, మహిళల భద్రత, లేదా పిల్లల రక్షణ వంటి సందర్భాల్లో తక్షణ సహాయం కోసం భారతదేశంలో అనేక హెల్ప్‌లైన్ నంబర్లు అందుబాటులో ఉన్నాయి. చాలామందికి 108 తెలుసు, కానీ ఇంకా ఇతర ముఖ్యమైన నంబర్లు కూడా ఉన్నాయి, ఇవి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.
*108 – ఎమర్జెన్సీ సర్వీస్ : ఈ నంబర్ ద్వారా అంబులెన్స్, ఫైర్ సర్వీస్, మరియు పోలీస్ సహాయం ఒకే కాల్‌తో అందుతుంది. ఎక్కడి నుంచైనా 108 డయల్ చేస్తే, సమీప ఎమర్జెన్సీ బృందం వెంటనే స్పందిస్తుంది. ఇది ప్రాణాలను కాపాడే కీలక సేవ.
*100 – పోలీస్ హెల్ప్‌లైన్ : నేరాలు, దొంగతనం, దాడులు లేదా ఇతర భద్రతా సమస్యల సమయంలో 100కి కాల్ చేస్తే సమీప పోలీస్ స్టేషన్ నుంచి తక్షణ సాయం అందుతుంది.
*101 – ఫైర్ సర్వీస్ : అగ్ని ప్రమాదాల సమయంలో 101 డయల్ చేయడం ద్వారా ఫైర్ సిబ్బంది వాహనాలు వేగంగా సంఘటనా స్థలానికి చేరుకుంటాయి. చిన్న , పెద్ద అగ్ని ప్రమాదమైనా, ఈ నంబర్ సహాయపడుతుంది.
*102 – ఉచిత అంబులెన్స్ : గర్భిణీ స్త్రీలు, ప్రసవ సమస్యలు ఎదుర్కొనేవారు, లేదా చిన్నారుల కోసం ఈ నంబర్ ఉచిత అంబులెన్స్ సేవలను అందిస్తుంది. చాలా రాష్ట్రాల్లో ఈ సేవ బాగా పనిచేస్తుంది.
*104 – హెల్త్ అడ్వైజరీ : అనారోగ్య సమస్యల సమయంలో, డాక్టర్‌ని సంప్రదించలేని పరిస్థితుల్లో, 104 ద్వారా వైద్య సలహాలు పొందవచ్చు.
*1091 – మహిళల హెల్ప్‌లైన్ : వేధింపులు, హింస, లేదా బెదిరింపుల సమయంలో మహిళలు ఈ నంబర్‌కి కాల్ చేసి సురక్షిత సహాయం పొందవచ్చు.
*1098 – చైల్డ్ హెల్ప్‌లైన్ : ఒంటరిగా ఉన్న పిల్లలు, బిచ్చమెత్తే చిన్నారులు, లేదా దౌర్జన్యం (టీజింగ్) ఎదుర్కొనే పిల్లల కోసం 1098 ద్వారా చైల్డ్‌లైన్ టీమ్ తక్షణ చర్యలు తీసుకుంటుంది.
*112 – యూనివర్సల్ ఎమర్జెన్సీ: ఇది జాతీయ అత్యవసర నంబర్. పోలీస్, ఫైర్ సర్వీస్, యాంబులెన్స్ – అన్ని సేవలు ఈ ఒక్క నంబర్ ద్వారా అందుబాటులో ఉంటాయి.
ఇతర ముఖ్య నంబర్లు
1097: మానసిక ఆరోగ్య సలహాల కోసం.
181: రాష్ట్ర స్థాయి మహిళల హెల్ప్‌లైన్.
14567: వృద్ధుల కోసం సహాయం.
ఈ నంబర్లను గుర్తుంచుకోవడం లేదా మీ ఫోన్‌లో సేవ్ చేసుకోవడం ద్వారా అత్యవసర సమయంలో సమయానికి సహాయం పొందవచ్చు. ప్రతి ఒక్కరూ ఈ హెల్ప్‌లైన్ నంబర్ల గురించి తెలుసుకోవడం మరియు ఇతరులకు అవగాహన కల్పించడం ముఖ్యం.