BigTV English

Nandi idol : ప్రపంచంలోనే అతిపెద్ద నంది విగ్రహం ఉన్న ఆలయం

Nandi idol : ప్రపంచంలోనే అతిపెద్ద నంది విగ్రహం ఉన్న ఆలయం

Nandi idol : శ్రీ సత్యసాయి జిల్లాలోని లేపాక్షి వీరభద్ర స్వామి ఆలయాన్ని 16వ శతాబ్ధంలో నిర్మించారు. ఆలయంలో రాతిపై చెక్కిన శిల్పాల అందాలు మాటల్లో వర్ణించలేం. శిల్పుల ప్రతిభను మెచ్చుకోకుండా ఉండలేరు. ఏటా ఫిబ్రవరి నెలలో 10 రోజుల సుదీర్ఘ పండుగ జరుపుకుంటారు. ఈ సందర్భంగా కార్ ఫెస్టివల్ నిర్వహిస్తారు. ఆలయంలో భారతదేశంలో అతిపెద్ద ఏకశిలతో ఏర్పాటు చేసిన నంది శిల్పం ప్రత్యేకమైంది. దక్షిణ భారతదేశంలోనే లేపాక్షి తీర్థయాత్ర కేంద్రం. హిందూపూరం కోడికొండ చెక్ పోస్ట్ మధ్య లేపాక్షి గుడి ఉంది.


108 శైవ క్షేత్రాల్లో లేపాక్షి ఒకటని స్కందపురాణం చెబుతోంది. ఆలయంలోని పాపనశేశ్వర స్వామిని అగస్త్య మహర్షి ప్రతిష్ఠించారని పురాణాలు చెబుతున్నాయి. ఎదురెదురుగా ఉన్న పాపనశేశ్వరుడు, రఘునాథమూర్తి విగ్రహాలు ఇక్కడ ప్రత్యేకత. సీతమ్మవారిని ఎత్తుకుపోయిన రావణాసురునితో యుద్ధం చేసి జటాయువు ఇక్కడే పడిపోయాడని, రాముల వారు జటాయువు చెప్పిన విషయమంత విని కృతజ్ఞతతో లే! పక్షి! అని మోక్షం ప్రసాదించిన స్థలం ఇదే.. అందువల్లనే క్రమంగా లేపాక్షిగా మారిందని స్థల పురాణం చెబుతోంది. విజయనగర రాజుల కాలంలో నిర్మించిన ఈ దేవాలయం చక్కటి శిల్పకళకు, రమణీయమైన ప్రదేశం.

ఆలయ నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషించిన విశ్వకర్మ బ్రాహ్మణుల అద్భుతమైన కళా చాతుర్యానికి గొప్ప ఉదాహరణ ఈ నంది విగ్రహం. ఆలయం అద్భుతమైన మండపాలతో అలాగే శిల్పకళాచాతుర్యంతో అలరారుతూ ఉంటుంది. ఈ విగ్రహం ప్రపంచంలోని అతి పెద్ద విగ్రహాలలో ఒకటి. ఈ ఆలయంలో కొలువైన దేవుడు వీరభద్ర స్వామి. గుడి లోపల ఒక స్తంభానికి దుర్గా దేవి విగ్రహం ఉంది. మాములుగా దేవుడు మనకు గుడి బయటినుండే కనపడతాడు. వీరభధ్ర స్వామి ఉగ్రుడు కాబట్టి, అతని చూపులు నేరుగా ఊరి మీద పడకూడదు అని గుడి ద్వారం కొంచెం పక్కకు ఉంటుంది. . ఈ దేవాలయంలో ఫ్రెస్కో చిత్రాలలో కాంతివంతమైన రంగుల అలంకరణలతో ఉన్న రాముడు, కృష్ణుడు పురాణ గాథలు చెబుతుంటాయి.. ప్రతి సంవత్సరం దేశం నలుమూలల నుండి అనేకమైన భక్తులు తరలి వస్తుంటారు.


Tags

Related News

Navratri: నవరాత్రి 9వ రోజు.. దుర్గాదేవిని ఇలా పూజిస్తే సకల సంపదలు !

Bathukamma 2025: సద్దుల బతుకమ్మ.. పేరు వెనక అసలు కథ ఇదే !

Ramayana Story: ఎలుక పై మూడు గీతలు వెనుక శ్రీరాముడి మహిమ? మీకు తెలుసా?

Navratri Day 8: నవరాత్రుల్లో 8వ రోజు.. సరస్వతి దేవిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: వెన్నముద్దల బతుకమ్మ ప్రత్యేకత ఏంటి ?

Navaratri 2025: మహాచండీ దేవిని 7వ రోజు ఎలా పూజించాలి ? సమర్పించాల్సిన నైవేద్యం ఏంటి ?

Navaratri 2025: నవరాత్రి 6వ రోజు.. లలితా దేవిని ఏ విధంగా పూజించాలో తెలుసా ?

Bathukamma 2025: వేపకాయల బతుకమ్మ.. ఆ పేరు వెనక కథ, సమర్పించాల్సిన నైవేద్యం ఏంటి ?

Big Stories

×