BigTV English

Shani Parivartini Ekadashi Upay: ఈ రోజు శని అనుగ్రహం కోసం ఈ పరిహారాలు చేయండి

Shani Parivartini Ekadashi Upay: ఈ రోజు శని అనుగ్రహం కోసం ఈ పరిహారాలు చేయండి

Shani Parivartini Ekadashi Upay: పరివర్తిని ఏకాదశిని  సెప్టెంబర్ 14, 2024, శనివారం జరుపుకుంటున్నారు. దీనిని పద్మ ఏకాదశి, జల్ఝులని ఏకాదశి అని కూడా అంటారు. ఈరోజుకు సనాతన ధర్మంలో చాలా ప్రాముఖ్యత ఉంది. శనిదేవుని ప్రసన్నం చేసుకోవడానికి ఈ రోజు ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. అంతే కాకుండా ప్రస్తుతం గణేష్ నవరాత్రులు కూడా జరుగుతున్నాయి. ఈ రోజు మూడు యోగాలు కలయిక కూడా ఏర్పడుతోంది. ఈ సందర్భంగా మనం కొన్ని రకాల పూజలు నిర్వహిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.


పరివర్తినీ ఏకాదశితో పాటు ఈ రోజు శని వారం కాబట్టి ఈ రోజు శనిదేవుడిని పూజించడం మంచిది. ఈ రోజు శనిదేవుడి ఆలయాన్ని సందర్శించి స్వామని పూజిస్తే చాలా శుభం. అంతే కాకుండా శని దేవుడికి ఆవనూనె సమర్పించాలి. శనిదేవునికి నీలిరంగు పువ్వులు, నల్ల నువ్వులు, నల్ల పప్పు సమర్పించండి. ఓం షాన్ శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని పఠిస్తూ పూజ చేయండి.

శని పరివర్తిని ఏకాదశి పరిహారాలు:


శనివారం వచ్చిన ఈ పరివర్తిని ఏకాదశి రోజున పేదవారికి దానం చేయండి. ఈరోజు ధనం, అన్నం, గొడుగులు, పాదరక్షలు, మొదలైన వాటితో పాటు నూనె, నువ్వులు దానం చేయడం విశేష ఫలితాలను ఇస్తుంది. ఈ పరిహారం చేయడం వల్ల శనిదేవుని అనుగ్రహం మీపై నిలిచి ఉంటుంది.

ఈరోజు రావి చెట్టును పూజించండి. అంతే కాకుండా నీటిలో పంచదార వేసి చెట్టుకు సమర్పించాలి. దీని తరువాత, సాయంత్రం చెట్టు ముందు నెయ్యి దీపం వెలిగించండి. ఈ పరిహారం చేయడం ద్వారా అప్పుల బాధలు తొలగిపోతాయి. అంతే కాకుండా మీ జీవితంలో ఆనందం పెరుగుతుంది.

Also Read: అశ్వినీ మాసంలో ఈ నియమాలు పాటిస్తే దేవతలు సంతోషిస్తారు..

పరివర్తిని ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి కుంకుమపువ్వుతో స్వామికి అభిషేకం చేయండి. అలాగే పసుపు పూలతో దండలు వేసి పసుపు మిఠాయిలు సమర్పించండి. ఈ పరిహారం చేయడం ద్వారా శ్రీమన్నారాయణుడు సంతోషిస్తాడు. మీకు ఆనందం, శ్రేయస్సును అనుగ్రహిస్తాడు.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Navaratri 2025: నవరాత్రి 6వ రోజు.. లలితా దేవిని ఏ విధంగా పూజించాలో తెలుసా ?

Bathukamma 2025: వేపకాయల బతుకమ్మ.. ఆ పేరు వెనక కథ, సమర్పించాల్సిన నైవేద్యం ఏంటి ?

Navratri 2025: దృష్టశక్తులు తొలగిపోవాలంటే.. నవరాత్రి సమయంలో ఇలా చేయండి !

Bastar Dussehra Festival: అక్కడ 75 రోజుల పాటు దసరా ఉత్సవాలు.. ప్రాముఖ్యత ఇదే!

Navratri Day 5: నవరాత్రుల్లో 5వ రోజు అమ్మవారిని.. ఏ విధంగా పూజించాలి ?

Bathukamma: అలిగిన బతుకమ్మ అనే పేరు ఎలా వచ్చింది ? ఈ రోజు నైవేద్యం ఎందుకు సమర్పించరు ?

Navratri Day-4: నవరాత్రి నాల్గవ రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: ఐదో రోజు అట్ల బతుకమ్మ.. అట్లు నైవేద్యంగా పెట్టడం వెనక ఉన్న కారణం ఏంటి ?

Big Stories

×