BigTV English

Cristiano Ronaldo: సోషల్ మీడియాలో అతని ఫాలోవర్స్.. 100 కోట్లు

Cristiano Ronaldo: సోషల్ మీడియాలో అతని ఫాలోవర్స్.. 100 కోట్లు

Cristiano Ronaldo Followers: అబ్బా.. ఎవర్రా బాబూ.. ఆ అదృష్టవంతుడని అనుకుంటున్నారా? మరెవరో కాదు.. రెండు దశాబ్దాలుగా ఫుట్ బాల్ లో ఆధిపత్యం చెలాయిస్తున్న క్రిస్టియానో రొనాల్డో. తనిప్పుడు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఆటగాడిగా పేరు పొందాడు. ఇంతకీ తనకి సోషల్ మీడియాలో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారని అనుకుంటున్నారు.


100 కోట్ల మంది ఫాలోవర్స్. అయితే అన్ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫారాల్లో ఉన్న అభిమానులను కలిపి.. ఈ ఘనత సాధించాడు. అంటే ఇన్ స్టా, ఫేస్ బుక్, ఎక్స్, యూట్యూబ్ ఇలా అన్నమాట.

ఈ క్రమంలో 100 కోట్ల ఫాలోవర్స్ మ్యాజిక్ ఫిగర్ దాటగానే 39 ఏళ్ల రొనాల్డో ఒక పోస్టు పెట్టాడు. ఇంతమంది అభిమానులను సంపాదించుకోవడం చాలా గొప్ప విషయమని, ఇంతకాలం ఇంతగా ఆదరిస్తున్న అభిమానులందరికీ కృతజ్ఞతలని తెలిపాడు. అంతేకాదు మనం సోషల్ మీడియాలో చరిత్ర సృష్టించామని ప్రకటించాడు.


వన్ బిలియన్ ఫాలోవర్స్! అన్ బిలీవబుల్.. ఇది కేవలం సంఖ్య మాత్రమే కాదు. ఆటపై మీకున్న అభిరుచి, ప్రేమ, అభిమానం.. ఇలా వీటన్నింటికన్నా మించినదని రొనాల్డో పోస్టులో రాసుకొచ్చాడు. పోర్చుగల్ లోని మదీరా వీధుల నుంచి ప్రపంచంలోని అతి పెద్ద వేదికల వరకు నా కుటుంబం కోసం, మీ కోసం ఆడానని అన్నాడు.

ఇప్పుడు నాతో 100 కోట్ల మంది కలిసారని అన్నాడు. ఇక నుంచి మనకు భయం లేదు, తిరుగు లేదు. ఎదురు లేదని తెలిపాడు. అయితే ఇన్ని కోట్లమంది కూడా.. ఫుట్ బాల్ కోర్టులో నేను వేసే ప్రతి అడుగులో నా వెనుకే ఉండి నన్ను ప్రోత్సహించారని అన్నాడు. ఓటమి గెలుపులో, కష్టనష్టాల్లో, సుఖదుఖాల్లో ఇలా అన్నింటా నా వెంటే ఉండి, నేను గోల్ కొడితే సంతోషించారు. ఓడిపోతే నిరాశ చెందారని ఎమోషనల్ తో రాసుకొచ్చాడు.

Also Read: పారాలింపిక్స్ విజేతలకు.. మోదీ మార్క్ ఆతిథ్యం

ఇది మన ప్రయాణం. ఇలాగే కొనసాగిద్దాం.. ఇంతవరకు మనం కలిసి పరిమితులు లేవని నిరూపించాం.. ఇకముందు అలానే ఉందామని తెలిపాడు. మీరందరూ నా జీవితంలో భాగమైనందుకు ధన్యవాదాలని తెలిపాడు. ఇక్కడితో ఏమీ అయిపోలేదు. ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. ఇలాగే కలిసి మెలిసి గెలుపు వెంట సాగిపోదాం. మరో చరిత్ర సృష్టిద్దామని అన్నాడు.

ఏ బిలియన్ డ్రీమ్ ఒన్ జర్నీ అనే ట్యాగ్‌తో సుదీర్ఘ పోస్ట్ పెట్టాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్టుకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఎందుకలాగంటే.. తనకిక్కడే సుమారు 64 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఎక్స్ లో.. 11.3 కోట్ల మంది, ఫేస్‌బుక్‌లో 17 కోట్ల మంది ఫాలోవర్లు, యూ ట్యూబ్ లో 6 కోట్ల మంది ఉన్నారు.

చాలామంది అనేదేమిటంటే అభిమానులున్నారంటే ఇక్కడి వాళ్లే అక్కడ, అక్కడ వాళ్లే ఇక్కడుంటారు. అందువల్ల 100 కోట్లు అనేది కరెక్టు కాదని కొందరి వాదన.. ఎలాగైతేనేం 100 కోట్ల ఫిగర్ టచ్ చేశాడా? లేదా? అని కొందరు నెట్టింట వాదించుకుంటున్నారు.

అయితే రొనాల్డో ఇటీవల యూట్యూబ్‌ ఖాతాను ఓపెన్ చేశాడు. ఇలా చేయగానే అరపూటలోనే కోటి మంది ఫాలోవర్లు వచ్చేశారు. ఇదే కాకుండా ఆటలో కూడా రొనాల్డో అరుదైన ఘనత సాధించాడు. అదేమిటంటే తన కెరీర్‌లో 900వ గోల్ సాధించాడు. ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు.

1236 మ్యాచ్‌ల్లో రొనాల్డో 900 గోల్ మార్క్‌‌ను అందుకున్నాడు. తన తర్వాత రెండో స్థానంలో అర్జెంటీనా దిగ్గజం 37 ఏళ్ల లియోనెల్ మెస్సీ ఉన్నాడు. అతను 859 గోల్స్ సాధించాడు. తను కూడా అర్జెంటీనా ఆటగాడు కావడం విశేషం.

Related News

Harshit Rana – Gambhir : టీమిండియాకు అస‌లు విల‌న్‌ హర్షిత్ రాణానే..గంభీర్ వ‌ల్లే ఈ చెత్త ప్లేయ‌ర్ ఆడుతున్నాడంటూ ట్రోలింగ్‌

IND VS PAK, Final: ఫైన‌ల్ కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ‌..అభిషేక్ శర్మ, పాండ్యా ఔట్ ?

Asia Cup 2025 : దాసున్ షనకా చేసిన ఈ ఒక్క డైవ్ శ్రీలంక కొంప ముంచింది.. జయ సూర్య లేచి మరి వార్నింగ్ ఇచ్చాడు

Dasun Shanaka Run Out: సూప‌ర్ ఓవ‌ర్ లో టీమిండియాకు అన్యాయం…రనౌట్ అయినా షనకా నాటౌట్‌..రూల్స్ ఏం చెబుతున్నాయి?

Pathum Nissanka Six: నిస్సంక భ‌యంక‌ర‌మైన సిక్స్‌…తుక్కు తుక్కైన‌ కారు..త‌ల‌ప‌ట్టుకున్న గంభీర్‌

IND Vs SL : ఇండియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్ లో సూపర్ ఓవర్… ఎవరు గెలిచారంటే

Asia Cup 2025 : ఆసియా కప్ ఫైనల్స్ కు ముందు షాక్…సూర్య, రవూఫ్‌కు 30% ఫైన్

IND Vs SL : 300కు పైగా పరుగులు.. అభిషేక్ శర్మ సరికొత్త రికార్డు.. శ్రీలంక టార్గెట్ ఎంత అంటే ?

Big Stories

×