BigTV English

Tips For Bed Room : బెడ్ రూంలో ఈ వస్తువులు మీ దగ్గర పెట్టుకుంటున్నారా…

Tips For Bed Room : బెడ్ రూంలో ఈ వస్తువులు మీ దగ్గర పెట్టుకుంటున్నారా…


Tips For Bed Room : ప్రతీ మనిషికి తిండి ఎంత ముఖ్యమో.. నిద్ర కూడా అంతే అవసరం. కంటి నిండా నిద్రలేకపోతే వచ్చే ఆరోగ్య సమస్యలు ఒక పట్టాన పోవు. నిద్ర సరిగ్గా ఉంటేనే ఆలోచించే తీరు సక్రమంగా ఉంటుంది. ఎన్ని గంటలు పడుకున్నా ఎలా పడుకున్నా సుఖంగా పట్టే నిద్ర ఉండాలి. శరీరానికి విశ్రాంతి నిచ్చే నిద్ర అతి ముఖ్యమైంది. అయితే ప్రతీ రోజు రాత్రి మంచం ఎక్కే ముందు కొన్ని రకాల వస్తువులు దగ్గర లేకుండా చూసుకోవాలి.

ఎలాంటి మంచం మీద పడుకుంటున్నామో సంగతి పెడితే ఎలాంటి వస్తువులు పక్కన పెట్టుకుంటున్నామన్నదే ముఖ్యమైంది. వాస్తు శాస్త్రం నిద్రకు ఉపక్రమించే పద్దతులు గురించి కొన్ని సూచనలు చేసింది. మంచం దగ్గర కానీ సమీపంలోనీ పర్సును ఉంచు కో కూడదు. డబ్బును దాచుకునే వాలెట్ పడుకునేటప్పుడు పక్కన పెట్టుకుంటే మనశ్శాంతి చెడగొడుతుంది. దీని వల్ల అశాంతి కలుగుతుంది. ఆకలి రుచి ఎరుగదు, నిద్ర సుఖమెరుగదు అన్నట్టు మంచం మీద పడుకున్నా, నేలపై పడుకున్నా డబ్బులు ఉన్న పర్సులు దగ్గర పెట్టుకోవద్దు. డబ్బును కూడా ఉంచుకోద్దు


ఈ రోజుల్లో మొబైల్ లేని జీవితాలు ఊహించలేం. అలాంటి మొబైల్ అరక్షణం కనిపించకపోయినా అల్లాడిపోతుంటారు కొందరు. కాబట్టి మనిషి జీవితంలో భాగమైన నిద్రను ఈ మొబైల్ డిస్టర్బ్ చేయకుండా చూసుకోవాలి. అదే పాత రోజుల్లో పడుకునేటప్పుడు కూడా పుస్తకాలు చదువుకుని నిద్రపోయే అలవాటు ఉన్న వాళ్లు కనిపించే వారు. కానీ వాస్తవానికి సరస్వతి మాతకు ప్రతీక అయిన పుస్తకాలను నిద్రించే చోట ఉంచకూడదు. దేవతను అవమానించినట్టే.

ఇంకొందరు కాళ్లకు చెప్పులతో ఇల్లాంతా తిరుగుతూ బెడ్ రూంలో కూడా నడుస్తుంటారు. షూస్ వేసుకున్నా చెప్పులు వేసుకున్నా అవి బెడ్ రూం వరకు రాకూడదని వాస్తుశాస్త్రం చెబుతోంది. వేటిని ఎక్కడ ఉంచాలో అక్కడే పెట్టాలంటోంది. మంచం కింద చెప్పులు పెట్టి నిద్ర పోకూడదని చెబుతోంది . ఇలాంటి అలవాటు వల్ల మనకు తెలియకుండానే మనశ్శాంతి కరువవుతుంది. నిద్రాభంగం అనే రకాల సమస్యలను తెచ్చిపెడుతుంది. ఆరోగ్య సమస్యలతోపాటు చేసే పనిపైన ప్రభావం పడుతుంది. ఆ రకంగా మానసికంగాను మనపైన ప్రభావం చూపుతుంది. కాబట్టి నిద్రించే సమయంలో ఈ వస్తువులు దగ్గర పెట్టుకోకూడదు

Related News

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Big Stories

×