Hyderabad: హైదరిబాద్‌లో మూసీనది ఉగ్రరూపం దాల్చింది. దాదాపు ఐదేళ్ల తర్వాత భారీ వరదగా పోటెత్తింది. బాపుఘాట్ నుంచి దిగువ ప్రాంతాలకు ఉద్రృతంగా ప్రవహిస్తుంది. పురానాపూల్ వంతెన వద్ద 13 అడుగుల మేర ప్రమాదకరంగా మూసీ ప్రవహిస్తోంది. దీంతో పరిసర ప్రాంతాలు నీట మునిగాయి. ముఖ్యంగా కిషన్‌బాగ్ లోని మెహ్మద్ నగర్ నీట మునిగింది. ఉదయం 4 గంటల సమయంలో ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. చాలా మంది ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోయారు. హైడ్రా, జిహెచ్ఎంసి సిబ్బందులు సహాయ చర్యలు చేపట్టారు. అధికారులు దీనిపై దృష్టి సారించి నష్ట పరిహారం అందించాలని బాధితులు కోరుతున్నారు.