Bigg Boss 9 Mid Week Elimination: బిగ్ బాస్ తెలుగు 9 వీకెండ్ ఎపిసోడ్ లేటెస్ట్ ప్రొమో వచ్చింది. ఈ ప్రొమోలో మొత్తం మిడ్ వీక్ ఎలినేషన్ చూపించారు. సంజనను స్టేజ్పైకి పిలిచి.. ఆమె ఎలిమినేషన్ని ప్రకటించాడు హోస్ట్ నాగార్జున. ఇక స్టేజ్పైకి వచ్చిన సంజన తనకు వ్యతిరేకంగా మాట్లాడిన అందరిని కడిగి పారేసింది. అసలు నేను ఎలిమినేట్ అయ్యేంత బ్యాడ్ గా ఏం చేశాను అని హోస్ట్ నాగార్జున దగ్గర వాపోయింది సంజన. కానీ, ఏదైనా ఒకటి రెండు సార్లు చేస్తే బాగుంటుంది.. అన్నిసార్లు కన్ఫ్యూజ్ చేస్తూ ఇరిటేషన్ వస్తుందని చెప్పింది.
ఇక సంజన హౌజ్ని వీడుతుండటంతో భరణి లేచి.. మిస్ యూ అంటూ బాధను వ్యక్తం చేశాడు. అసలు సంజన బయటకు వెళ్లిపోవాలని ఓటు వేసిందే నువ్వు కదా హోస్ట్ నాగార్జున నవ్వుతూనే కౌంటర్ ఇచ్చారు. ఊరికే అన్న చెల్లి అనడం కాదు.. మనకు సమస్య వచ్చినప్పుడు పక్కన నిలబడేవాళ్లే మనవాళ్లు అంటూ భరణిపై ఫైర్ అయ్యింది. ఆ తర్వాత శ్రీజ తనలో మార్చుకోవాల్సిన విషయమేంటని చెప్పగా.. తను వెయ్యి శాతం వరస్ట్ ఆర్గ్యూమెంట్ నుంచి 300 శాతం ఆర్గ్యూమెంట్ వచ్చిందని చెప్పింది. సుమాన్ శెట్టికి దేనికి స్టాండ్ తీసుకోవడం రాదు అని చెప్పింది.
రాము రాథోడ్ ముందు ఒకలా, వెనకలా ఉంటాడు. అమాయకుడు అనుకున్నాను.. కానీ, కన్నింగ్. నీ అమాకపు మాటలతో అందరిని మోసం చేస్తున్నావంటూ రాము రాథోడ్పై ధ్వజమెత్తింది. ఒకరిని ఒకలా ట్రీట్ చేస్తుందటూ రాము రాథోడ్ అన్న కామెంట్స్పై సంజన ఫైర్ అయ్యింది. హరిష్.. బిహెవియర్తో ఎవరూ వెగలేరు. ఇలాంటి వ్యక్తితో అసలు ఉండలేం. ఏదో ప్రైం మినిస్టర్ని తీసుకువచ్చి.. హౌజ్ లో పెట్టినట్టు ఫోజులు కొడతాడంటూ ఉతికారేసింది. ఆ తర్వాత ఇమ్మాన్యుయేల్ని స్వీట్ హార్ట్ అంది. సంజన ఎలిమినేషన్ అనగానే ఇమ్మాన్యుయేల్ గుక్కపెట్టి ఏడ్చాడు. తన ఓళ్లో తలపెట్టి పడుకుంటే అమ్మలా అనిపిస్తుందని ఇమ్మూ భావోద్వేగానికి లోనయ్యాడు.
ఫైనల్గా హౌజ్లో అందరికి గుడ్బై చెప్పేయ్.. నువ్వు వెళ్లిపోయే టైం వచ్చిందంటూ నాగ్ అన్న కామెంట్స్ ప్రొమో ముగుస్తుంది. అయితే ఇక్కడ సంజన ఎలిమినేషన్ నిజమేనా అనే సందేహలు వస్తున్నాయి. ఎందుకంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ పేరుతో కంటెస్టెంట్స్ని సీక్రెట్ రూంలో పెట్టడం మొదటి సీజన్ నుంచి చూస్తున్నాం. ఈ సీజన్ కూడా మిడ్ వీక్ ఎలిమినేషన్ అని చెప్పి.. సంజనను సీక్రెట్ రూంలో పెట్టారు. అది నిన్నటి ఎపిసోడ్లోనే చూపించారు. మరి ఇప్పుడు ఎలిమినేషన్ అని చెప్పడం అనుమానం కలిగిస్తోంది. మిడ్ వీక్ ఎలిమినేషన్ అని చివరిలో బిగ్ బాస్ ట్విస్ట్ ప్లాన్ చేశాడనిపిస్తోంది. కానీ, ఈ ప్రొమోతో కంటెస్టెంట్స్ని ఫూల్ చేశాడు బిగ్ బాస్. అసలు సంగతి ఏంటన్నది నేటి ఎపిసోడ్లో తేలనుంది.