Papaya Seeds: బొప్పాయి ఒక రుచికరమైన పండు మాత్రమే కాదు. ఇది ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలు అందిస్తుంది. ఇదిలా ఉంటే వీటి విత్తనాలను పనికిరానివిగా భావించి చాలా మంది పడేస్తుంటారు. బొప్పాయి గింజలు శక్తివంతమైన సూపర్ ఫుడ్ గా పనిచేస్తాయి. వీటిలో ఉండే పోషకాలు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, ఎంజైములు, విటమిన్లు, ఖనిజాలు అనేక తీవ్రమైన వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షించడంలో సహాయపడతాయి. బొప్పాయి గింజల యొక్క కొన్ని అద్భుతమైన ప్రయోజనాల గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బొప్పాయి గింజల ప్రయోజనాలు:
కాలేయాన్ని డీటాక్స్ చేయడంలో సహాయం:
బొప్పాయి గింజలు కాలేయాన్ని నిర్విషీకరణ చేసి కాలేయ పనితీరును మెరుగుపరుస్తాయి. ఇవి ఫ్యాటీ లివర్, సిర్రోసిస్ వంటి సమస్యలను నివారించడంలో సహాయ పడతాయి.
మీ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోండి:
విత్తనాలలోని యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కిడ్నీలను ఇన్ఫెక్షన్ , వాపు నుంచి రక్షిస్తాయి. క్రమం తప్పకుండా తీసుకోవడం కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయ పడుతుంది.
జీర్ణవ్యవస్థను బలోపేతం చేయండి:
వీటిలో ఉండే పపైన్ ఎంజైమ్ జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. అంతే కాకుండా మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది .
నిర్విషీకరణలో సహాయపడుతుంది:
బొప్పాయి గింజలు శరీరం నుంచి హాని కరమైన విషాన్ని తొలగించడంలో సహాయపడతాయి. తద్వారా రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
పేగులో పురుగుల నుంచి రక్షణ:
బొప్పాయి గింజలు ముఖ్యంగా పిల్లలలో పరాన్నజీవులను నాశనం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. కడుపులో నులిపురుగుల సమస్యను తొలగిస్తాయి.
వాపు, నొప్పి నుంచి ఉపశమనం:
సహజ శోథ నిరోధక లక్షణాల కారణంగా.. ఇది ఆర్థరైటిస్, కీళ్ల నొప్పి , వాపు నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది.
బరువు తగ్గడంలో సహాయపడుతాయి:
ఈ విత్తనాలలో ఉండే ఫైబర్ కంటెంట్ జీవ క్రియను పెంచుతుంది. అంతే కాకుండా ఇది కొవ్వును వేగంగా కాల్చడానికి సహాయ పడుతుంది. అంతే కాకుండా ఇది బరువును కూడా అదుపులో ఉంచుతుంది.
చర్మానికి మెరుపు ఇస్తాయి:
బార్లీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మం నుంచి వ్యర్థ పదార్థాలను తొలగిస్తాయి. అంతే కాకుండా చర్మాన్ని ప్రకాశవంతంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి.
కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తాయి:
వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
Also read: రోజూ 10 నిమిషాలు వెనక్కి నడిస్తే.. ఇన్ని లాభాలా ?
క్యాన్సర్ నివారణలో సహాయపడతాయి:
బొప్పాయి గింజల్లో ఉండే ఫినోలిక్, ఫ్లేవనాయిడ్లు వంటి యాంటీఆక్సిడెంట్లు కొన్ని రకాల క్యాన్సర్ల నుంచి రక్షించడంలో సహాయపడతాయి.
జాగ్రత్త కూడా అవసరం:
బొప్పాయి గింజలను మితంగా తీసుకోండి. అధికంగా తీసుకోవడం వల్ల శరీరంపై ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. వాటిని ఎండ బెట్టడం, పొడిగా రుబ్బు కోవడం లేదా తేలికగా నమలడం ద్వారా తినడం సురక్షితం.
మీరు బొప్పాయి తిన్నప్పుడు..దాని గింజలను పారవేయకండి. వాటిని మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక వ్యాధుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు.
Also read: 30 ఏళ్లు దాటితే ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి ?