Kanatara: ఇటీవల కాలంలో ఒక సినిమా మంచి సక్సెస్ అందుకుంది అంటే ఆ సినిమా ఫ్రాంచైజీస్ రూపంలో ఎన్నో సిరీస్ లో ప్రేక్షకుల ముందుకు వస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కన్నడ స్టార్ దర్శకుడు, నటుడు రిషబ్ శెట్టి(Rishabh Shetty) స్వీయ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కాంతార(Kantara). ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా నేషనల్ అవార్డును కూడా అందుకుంది. భూతకోల నృత్యం నేపథ్యంలో కన్నడ సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేస్తూ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇక సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు ఫ్రీక్వల్ సినిమాగా కాంతార చాప్టర్ 1(Kantara Chapter1) సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అక్టోబర్ రెండవ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ వీడియో సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసింది. ఇక విడుదలకు మరికొద్ది రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో నటుడు రిషబ్ శెట్టి వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఇక ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన కాంతార సిరీస్ గురించి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.
కాంతార సినిమా ఫ్రీక్వెల్ తోనే ఆగిపోవడం లేదని ఈ సినిమాకు సీక్వెల్ కూడా రాబోతోంది అంటూ ఈయన వెల్లడించారు. కాంతార సినిమా మరిన్ని భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ఆలోచనలను కూడా సిద్ధం చేశామని తెలియజేశారు. కాంతార యూనివర్స్ నుంచి మరికొన్ని సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయని తెలియజేయడంతో అభిమానులు కాంతర సినిమా విషయంలో రిషబ్ శెట్టి ఇప్పట్లో అసలు ఆగేలా లేరు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన తన సినిమాలన్నింటినీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.
హనుమంతుడిగా రిషబ్ శెట్టి..
ఇక కాంతార చాప్టర్ 1 సినిమాలో రిషబ్ సరసన రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)హీరోయిన్ గా నటించగా, ఈ సినిమాని హోంభలే నిర్మాణ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా అక్టోబర్ రెండవ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలోనే ఒకటో తేదీని ప్రీమియర్లు ప్రసారం కానున్నాయి . ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్ లో ఎంతో ఘనంగా నిర్వహించబోతున్నారు. సెప్టెంబర్ 21 తేదీ జరగనున్న ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. ఇక రిషబ్ కాంతార సినిమాతో మంచి సక్సెస్ కావడంతో ఈయన తెలుగు సినిమాలలో కూడా నటించే అవకాశాలను అందుకుంటున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న జై హనుమాన్ (Jai Hanuman)సినిమాలో ఆంజనేయ స్వామి పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఇక త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా ప్రారంభం కానున్నాయి.
Also Read: Lenin Film: విడుదలకు సిద్ధమైన లెనిన్… అయ్యగారి రాక అప్పుడేనా?