Budha Gochar: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల సంచారం ముఖ్యమైందిగా చెబుతుంటారు. ప్రతి నెలలో గ్రహ సంచారం జరుగుతుంది. గ్రహాల సంచారం వాటి స్వభావాన్ని బట్టి ఫలితాలను కూడా ఇస్తాయి. వేద పంచాంగం ప్రకారం జూలై 19న బుధుడు మరోసారి తమ రాశిని మార్చుకుంటున్నాడు. బుధుడు తెలివితేటలు, డబ్బు, వ్యాపారం, కమ్యూనికేషన్, సంపద, మాటలకు అధిపతిగా చెబుతుంటారు.
జులై 19న రాత్రి 8:40 గంటలకు సింహ రాశిలోకి బుధుడు ప్రవేశిస్తాడు. 22 ఆగస్టు వరకు సింహ రాశిలోనే బుధుడు ఉంటాడు. ఈ సమయంలో 30 రోజులు కొన్ని రాశుల వారు ఒత్తిడితో కూడిన జీవితాన్ని గడుపుతారు. జీవితంలో అనేక సమస్యలకు గురవుతుంటారు. అదే సమయంలో కొంతమంది ఉద్యోగం, వ్యాపారాలో నష్టాలు వస్తాయి. బుధుడి సంచారం వల్ల ఏ రాశి వారి జీవితంలో ప్రతికూల మార్పులు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి:
మేష రాశిలో బుధుడి సంచారం బలహీన ప్రభావం కలిగి ఉంటుంది. భవిష్యత్తులో ఉద్యోగం, వ్యాపారాల్లో ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. ఉద్యోగస్తులు ఒత్తిడి పరిస్థితిలో మీ లక్ష్యాన్ని కూడా పూర్తి చేయలేరు. దీంతో మంచి ఫలితాలు ఉండవు. మేష రాశి వారి వైవాహిక జీవితంలో సమస్యలు ఎదురవుతాయి. కుటుంబాలు తగాదాలు కూడా వస్తాయి. మీరు పనిచేసే చోట జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది.
మిధున రాశి:
ఉమ్మడి కుటుంబంలో ఉన్న వారి మధ్య ఏదో ఒక పనికిమాలిన విషయానికి వాగ్వాదాలు చోటుచేసుకోవడం జరుగుతుంది. ఈ సమయంలో మిథున రాశి వారు కొనుగోలుకు డబ్బు
పెట్టకుండా ఉంటే మంచిది. పనుల్లో నిర్లక్ష్యం కారణంగా ఉపాధి వ్యక్తులు ఉద్యోగం నుంచి తొలగించబడతారు.
కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి ఇది అంత మంచి సమయం కాదు. ఇప్పుడు చేసినపనులు మీ భవిష్యత్తులో కూడా వెంట ఉంటాయి. అలాగే సకాలంలో పనులు పూర్తి చేయకపోవడం వల్ల వ్యాపారంలో నష్టాలు కూడా పెరుగుతాయి. ఆచితూచి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.
తులా రాశి :
తులా రాశిలో బుధుడి సంచారం వల్ల ప్రభుత్వ ఉద్యోగులకు ఆశాజనకంగా ఉండదు. కష్టపడి పని చేసినా నిరాశే మిగులుతుంది. వ్యాపారస్తులకు డబ్బులకు కొరత ఏర్పడుతుంది. దాంతో డబ్బు లేదా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునే అవకాశం ఉంటుంది.
మకర రాశి:
ఈ సమయం ఉద్యోగస్తులకు సవాళ్లతో కూడుకుంది. ఎంత కష్టపడినా ఫలితం కూడా ఉండదు . ఎక్కువ ఒత్తిడికి గురికావాల్సి వస్తుందని. ఆందోళన బాగా పెరుగుతుంది. సక్రమంగా పని చేయలేదు. దాంతో పై అధికారులు మీపై కోపంగా ఉంటారు. అలాగే క్లిష్ట సమయంలో ఆస్తులు, వాహనాల కొనుగోలు చేయకుండా ఉంటే మంచిది. అవివాహితులకు సమస్యలు తప్పవు. జీవిత భాగస్వామి నుంచి చెడు వార్తలు వినాల్సి వస్తుంది.
Also Read: గురు పూర్ణిమ నాడు ఈ 2 రాశులపై బృహస్పతి అనుగ్రహం..
మీన రాశి:
సింహరాశిలో బుధుడు సంచారం వల్ల మీ రాశి వారి జీవితంలో సమస్యలు ఎక్కువవుతాయి. ముఖ్యంగా పనుల్లో ఎంత కష్టపడినా ఫలితం ఉండదు. సవాళ్లను ఎదుర్కొనే అవకాశాలున్నాయి. పెద్దల సహకారం అసలు ఉండదు. ఖర్చులు బాగా పెరుగుతాయి. దీంతో అప్పులు చేయాల్సి వస్తుంది.