భారతీయ రైల్వే రోజు రోజు మరింత అభివృద్ధి చెందుతోంది. అందులో భాగంగానే ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తోంది. ఒకప్పుడు రైళ్లలో టాయిలెట్స్ అత్యంత చెత్తగా ఉండేవి. అందులోకి వెళ్లాలంటేనే భయపడేవారు. కానీ, గత దశాబ్ద కాలంగా రైళ్లలో పరిశుభ్రత మరింత పెరిగింది. అత్యాధునిక టాయిలెట్స్ అందుబాటులోకి తీసుకొస్తున్నారు. తాజాగా ముంబై-ఢిల్లీ రాజధాని ఎక్స్ ప్రెస్ రైలులో సరికొత్త టాయిలెట్ ను ఇన్ స్టాల్ చేశారు. ఆ రైల్లో ప్రయాణించిన ఓ ట్రావెలర్ ఈ టాయిలెట్ కు సంబంధించిన వీడియోను తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. రైల్లో చక్కటి సీట్లు, సెన్సార్ తో కూడిన వాష్ రూమ్ లను చూపించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దేశంలోని అన్ని రైళ్లలో ఇలాంటి టాయిలెట్స్ అందుబాటులోకి తీసుకొస్తే బాగుంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ముంబై-ఢిల్లీ రాజధాని ఎక్స్ ప్రెస్ టాయిలెట్ అత్యంత పరిశుభ్రంగా ఉన్నట్లు ట్రావెలర్ ఈ వీడియోలో చెప్పుకొచ్చాడు. ఎలాంటి మచ్చ లేని టాయిలెట్ సీట్, సెన్సార్ దగ్గర చేయిపెట్టగానే టాయిలెట్ బేసిన్ లోకి వాటర్ వెళ్లే విధానం ఆకట్టకుంటుంది. చేయి సెన్సార్ దగ్గరికి వెళ్లగానే టాయిలెట్ కవర్ ఆటోమేటిక్ మారడం కనిపిస్తుంది. “నేను దేశంలోనే అత్యంత వేగవంతమైన రాజధాని రైలు – ముంబై రాజధానిలో ప్రయాణిస్తున్నాను. ఈ రైలులో ఒక ప్రత్యేకమైన విషయాన్ని చూపించబోతున్నాను. నేను మరే రైళ్లలోనూ చూడలేదు” అంటే తన వీడియోను ప్రారంభించాడు. ఆ తర్వాత అతను వాష్ రూమ్ లోకి వెళ్లి అందులో ఉన్న అద్దం, వాష్ బేసిన్, టాయిలెట్ బేసిన్ చూపిస్తాడు. అలాగే పక్కన ఉన్న సెన్సార్ ను చూపిస్తాడు. తన చేయి సెన్సార్ ను తాకినప్పుడు టాయిలెట్ మూతపై ఉన్న ప్లాస్టిక్ కవరింగ్ ఆటో మేటిక్ మారుతున్నట్లు కనిసితుంది. అప్పటి వరకు కూర్చునేందుకు అనుకూలంగా ఉన్న టాయిలెట్ సీట్ కవర్ నుంచి.. సెన్సార్ దగ్గర చేయిపెట్టగానే నీళ్లు వచ్చేస్తాయని వివరించాడు. “భారతీయ రైల్వేలలో ప్రత్యేకమైన వాష్‌రూమ్” అంటూ ఈ వీడియోను షేర్ చేశాడు.
Read Also: ఐఆర్‌సీటీసీలో ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ స్టార్ట్ అయ్యేది ఈ టైమ్‌లోనే.. ఇది గుర్తుపెట్టుకోండి!
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పుటి వరకు సుమారు లక్షకు పైగా వ్యూస్ సాధించింది. చాలా మంది క్రేజీగా కామెంట్స్ పెడుతున్నారు. ఈ టాయిలెట్ అద్భుతంగా ఉందంటున్నారు. ఇలాంటి టాయిలెట్స్ ఏర్పాటు చేయడం ద్వారా భారతీయ రైల్వే మరో ముందడుగు వేసినట్లుగా భావించాల్సి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. సెన్సార్ టాయిలెట్ బాగుంది. కానీ, మనాళ్లు ఉంచుతారో ఉడపీకుతారో? అంటూ మరో వ్యక్తి సందేహం వ్యక్తం చేశాడు. మొత్తంగా భారతీయ రైల్వేలో పరిశుభ్రత దిశగా ఈ టాయిలెట్స్ మరో అడుగు ముందుకు వేశాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
Read Also: ఛీ.. సూప్ లో మూత్రం పోసిన టీనేజర్, రూ.2.56 కోట్లు జరిమానా విధించిన కోర్టు!