Rashmika -Vijay Devarakonda: రష్మిక (Rashmika) విజయ్ దేవరకొండ(Vijay Devara konda) ఈ జంటకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరూ కలిసి రెండు సినిమాలలో నటించారు. అయితే ఈ సినిమాల సమయంలోనే ఇద్దరు మధ్య ప్రేమ చిగురించిందని ప్రస్తుతం వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారు అంటూ తరచు వీరికి సంబంధించి ఎన్నో రకాల వార్తలు బయటకు వస్తున్నాయి. ఇలా ఈ వార్తలకు అనుగుణంగానే వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసే ఫోటోలు చూస్తే నిజం అని తెలుస్తుంది. ఇద్దరు ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్లడం ఆ ఫోటోలను విడివిడిగా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈజీగా దొరికిపోతారు.
తాజాగా మరోసారి రష్మిక విజయ్ దేవరకొండ కలిసి ఈ ఏడాది దసరా పండుగ(dussehra Festival) వేడుకలను ఒకే చోట జరుపుకున్నారని స్పష్టమవుతుంది. తాజాగా రష్మిక పండుగ రోజున అందరికీ దసరా శుభాకాంక్షలు అంటూ కొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. చీర కట్టుకొని కుంకుమ బొట్టుతో ఈమె లుక్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. అయితే రష్మిక ఈ ఫోటోలను షేర్ చేయడంతో ఈమె దసరా వేడుకలను విజయ్ దేవరకొండ ఇంట్లో జరుపుకున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
రష్మిక షేర్ చేసిన ఫోటోలలో ఉన్న డోర్ గతంలో విజయ్ దేవరకొండ అలాగే తన అమ్మ షేర్ చేసిన ఫోటోలలో రూమ్ డోర్స్ అన్ని కూడా ఒకే విధంగా ఉండడంతో రష్మిక విజయ్ దేవరకొండ ఇంట్లోనే దసరా పండుగను జరుపుకుంది అంటూ ఈ ఫోటోలను మరింత వైరల్ చేస్తున్నారు. మీరు నిజం దాచవచ్చు కానీ ఇంటి తలుపులు నిజాన్ని దాచలేవు అంటూ ఈ ఫోటోలను షేర్ చేస్తున్నారు. ఇలా ఈ ఫోటోలపై నెటిజన్స్ కూడా విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. మీరు రిలేషన్ లో ఉన్నారన్నమాట వాస్తవమే ఇలా, పరోక్షంగా మీ రిలేషన్ గురించి సోషల్ మీడియాలో తెలియచేయడం కంటే నేరుగా మీ రిలేషన్ గురించి ఓపెన్ అవ్వచ్చు కదా అంటూ కామెంట్ లు చేస్తున్నారు.
రష్మిక కూడా గతంలో తాను ఇండస్ట్రీకి చెందిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని అతడు ఎవరో మీ అందరికీ తెలుసు అంటూ కూడా మాట్లాడటంతో వీరి రిలేషన్ కన్ఫర్మ్ అంటూ అభిమానులు భావిస్తున్నారు. ఇకపోతే రష్మిక కెరియర్ విషయానికి వస్తే ఇటీవల కుబేర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్న రష్మిక త్వరలోనే ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమాతో పాటు ఈమె థామా అనే సినిమాలో కూడా నటిస్తున్నారు. మరోవైపు విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా ద్వారా మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం ఈయన తన తదుపరి సినిమా పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.
Also Read: Bigg Boss 9 Promo2: కళ్యాణ్‌కు రీతూ వెన్నుపోటు.. మళ్లీ కుళాయి ఓపెన్ చేశాడుగా!