BigTV English

OTT Movie : కన్న తల్లిని కడుపులో నుంచే తినేసే పిల్ల రాక్షసి… డాక్టర్ కు కూడా చుక్కలు చూపించే సైతాన్

OTT Movie : కన్న తల్లిని కడుపులో నుంచే తినేసే పిల్ల రాక్షసి… డాక్టర్ కు కూడా చుక్కలు చూపించే సైతాన్

OTT Movie : ఓ కాలం నాటి నుంచి మనకు అంతు చిక్కని ప్రశ్న ఉందంటే అది దేవుడు, దెయ్యం. ఎంతో మంది సైన్స్ ని నమ్ముతూ దేవుడు, దెయ్యాలు లేవని వాదనలు కూడా మొదలెట్టేశారు. అయితే ఎవరి నమ్మకం వారిది. ఈ కాన్సెప్ట్ తో ఒక హారర్ సిరీస్ ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతోంది. ఇందులో ఒక టీమ్ వీటి మీద రీసర్చ్ చేస్తూ, భయంకరమైన పరిణామాలను ఎదుర్కుంటుంది. 56 ఎపిసోడ్‌లతో ఈ సిరీస్ ను చూస్తే, ఊపిరిని పీల్చుకోవడం కూడా కష్టమవుతుంది. ప్రతి ఎపిసోడ్ లో ఒక కొత్త దెయ్యం కేసుతో ఈ సిరీస్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

‘ఈవిల్’ (Evil) ఒక అమెరికన్ హారర్ సిరీస్. మైఖేల్, రాబర్ట్ కింగ్ దీనిని సృష్టించారు. ముఖ్య పాత్రల్లో క్రిస్టెన్ (కట్జా హెర్బర్స్), డేవిడ్ (మైక్ కోల్టర్), బెన్ (ఆసిఫ్ మండ్వి) నటించారు. ఇది 4 సీజన్లు, 56 ఎపిసోడ్‌లతో 2019లో మొదలై, చివరి ఎపిసోడ్ 2024 ఆగస్టు 22న ముగిసింది.
IMDbలో 7.8/10 రేటింగ్ ని కూడా పొందింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సిరీస్ అందుబాటులో ఉంది.

కథలోకి వెళ్తే

క్రిస్టెన్ అనే ఒక సైకాలజిస్ట్, సైన్స్‌ను ఎక్కువగా నమ్ముతుంది. ఆమె దెయ్యాలను, మూఢనమ్మకాలను నమ్మదు. ఒక చర్చ్ ఆమెను దెయ్యం ఆవహించిన కేసులు, నిజమా కాదా అని చూడటానికి హైర్ చేస్తుంది. ఆమెతో డేవిడ్ అనే దేవుడిని నమ్మే వ్యక్తి, అసలు దేన్నీ నమ్మని బెన్ అనే టెక్ ఎక్స్‌పర్ట్ టీమ్ అప్ అవుతారు. వీళ్లు కలిసి ప్రతి ఎపిసోడ్లో కొత్త కేసును తీసుకుంటారు. దెయ్యం ఆవహించడం, హాంటెడ్ ఇళ్లు, కల్ట్ రిచ్యువల్స్ వంటి వాటి మీద రీసర్చ్ చేయడం మొదలుపెడతారు. మొదట్లో కేసులు నార్మల్ గా మొదలవుతాయి. కానీ వాటికి ఏదో ఒక సైంటిఫిక్ రీజన్ దొరుకుతుంటుంది.


అయితే కథ నడిచే కొద్దీ భయంకరంగా మారుతుంది. క్రిస్టెన్, డేవిడ్, బెన్ విచిత్ర కేసులను డీల్ చేస్తారు. క్రిస్టెన్ సైన్స్‌ను నమ్ముతూ దెయ్యం ఆనవాళ్ళతో గందరగోళంలో పడుతుంది. డేవిడ్ ప్రీస్ట్ ట్రైనింగ్‌లో ఉంటూ, దేవుడి నుండి విజన్స్ చూస్తాడు. బెన్ తన సోదరి రూపంలో వచ్చే దెయ్యంతో పోరాడుతాడు. సైన్స్‌తో దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాడు. క్రిస్టెన్ ఫ్యామిలీ కూడా ఈ సమయంలో అనేక ఇబ్బందులు పడుతుంది. ఆమె తన కూతురి ప్రవర్తనలో తేడా చూసి భయపడుతుంది. ఇక కథ భయంకరమైన సన్నివేశాలతో వణుకు పుట్టిస్తుంటుంది. చివరికి క్రిస్టెన్ టీం ఏం తెలుసుకుంటుంది ? అసలు దెయ్యాలు ఉన్నాయా ? ఉంటే వీళ్ళను ఏం చేశాయి ? అనే విషయాలను, ఈ అమెరికన్ హారర్ సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : భర్తపోయి బాధపడుతున్న అమ్మాయితో ఇదెక్కడి దిక్కుమాలిన పని ? సైకోకు అమ్మాయి ఇచ్చే షాక్ హైలెట్ భయ్యా

Related News

OTT Movie : పెళ్లి కాకుండానే టీనేజ్ అమ్మాయి ప్రెగ్నెంట్… చదువుకోవాల్సిన వయసులో ఇవేం పిచ్చి పనులు పాపా ?

OTT Movie : జుట్టు పట్టుకుని కొట్టుకునే తల్లీకూతుర్లు… అపర కుబేరులే కానీ అంతులేని వింతలున్న ఫ్యామిలీ

OTT Movie : చావును ముందే పసిగట్టే యాప్… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్… మైండ్ బెండయ్యే ట్విస్టులు

OTT Movie : భర్తపోయి బాధపడుతున్న అమ్మాయితో ఇదెక్కడి దిక్కుమాలిన పని ? సైకోకు అమ్మాయి ఇచ్చే షాక్ హైలెట్ భయ్యా

OTT Movie : పెళ్లి రోజే కాబోయే భర్త జంప్… మతి మరుపుతో ప్రియుడు కూడా… ఓటీటీలో దుమ్ము లేపుతున్న సరికొత్త లవ్ స్టోరీ

OTT Movie : మొగుడి మీద అనుమానం… మరో అమ్మాయిని భర్త రూమ్ లోకి పంపి… ఈ స్టోరీ మైండ్ బ్లోయింగ్

OTT Movie : 38 ఏళ్ళ ఆంటీతో 20 ఏళ్ళ అబ్బాయి… స్టూడెంట్ తోనే పని కానిచ్చే కథ… సింగిల్స్ కు పండగే

Big Stories

×