Tungnath Temple : ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన శివాలయం తుంగనాథ్. 8వ శతాబ్ద కాలం నాటి ఈ ఆలయం ఇప్పుడు ప్రమాద స్థితిలో పడింది. హిమాలయ సానువుల్లో ఉన్న గుడి ఎత్తు 12800 అడుగులు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తు ఉన్న ఆలయంగా రికార్డులకి ఎక్కింది. ఎనిమిదో శతాబ్ధం నాటి ఇప్పుడు ఐదారు డిగ్రీలు పక్కకి వంగుతున్నట్టు భారత పురావస్తు శాఖ ప్రకటించడంతో భక్తుల్లో కలకలం రేపుతోంది. ఆలయం నాలుగు వైపులు హిమాలయ పర్వతాలు సుందరంగా కనిపిస్తుంటాయి. పంచ కేదార ఆలయాల్లో ఈ టెంపుల్ ఒకటి. ఈ గుడిలో పరమ శివుడు వృషభ రూపంలో దర్శనమిస్తుంటాడు.
వేసవి కాలంలో మాత్రమే ఈ వృషభ శివుడ్ని దర్శించగలం. చలికాలంలో ఆలయం మొత్తం మంచుతో కప్పబడి పోతుంది. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు ఏవైనా ఈ శివుడ్ని దర్శిస్తే వెంటనే సమస్య తొలగి పని జరుగుతుందని భక్తుల విశ్వాసం. ఆనమ్మకంతోనే అత్యంత సంక్లిష్టమైన వాతావరణం మధ్య పర్వతాల మధ్య ఉన్న ఎత్తైన గుడిలో పూజల కోసం భక్తులు శ్రమించి వస్తుంటారు.
చలికాలంలో గర్భగుడి మొత్తం మంచులో కప్పబడి పోతు ఉంటుంది. అందుకే సీజన్ కు ముందే ఉత్సవ విగ్రహాన్ని మరో చోటకి తరలించి పూజిస్తూ ఉంటారు. వేసవికాలంలో మళ్లీ గుడికి తీసుకొచ్చి నిత్యపూజలు చేస్తుంటారు. పురాతనమైన కేదార్ నాథ్ ఆలయం కంటే ఈ గుడి పురాతనమైంది. మందాకిని, అలకనందా నదుల మధ్య ఆలయం కొలువుతీరింది. అలాంటి గుడికి ఏమవుతుందోనని భక్తులు ఆందోళన చెందుతున్నారు. ప్రమాదస్థితికి చేరుకున్న ఆలయాల జాబితాలో ఈగుడి చేర్చి పరిరక్షించే పనులు జరుగుతున్నాయి.