ఇండియాలో నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అదే సమయంలో పొరుగు దేశం పాకిస్తాన్ లోనూ కొన్ని ప్రాంతాల్లో హిందువులు నవరాత్రి వేడుకలను జరుపుకుంటున్నారు. తాజాగా ఈ వేడుకలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కిస్తాన్‌లో నివసిస్తున్న హిందూ ఇన్ స్టాగ్రామ్ యూజర్ ప్రీతమ్ దేవ్రియా షేర్ చేసిన ఈ క్లిప్, ప్రజలు సాంప్రదాయకంగా దుస్తులు ధరించి.. గర్బా, దాండియా నృత్యాలు చేస్తున్నట్లు కనిపించింది. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో దీపాలతో అలంకరించబడిన వీధిని, పూజ కోసం ఏర్పాటు చేసిన దుర్గాదేవి కనిపిస్తోంది. ఫ్లేర్డ్ స్కర్టులు, బ్లౌజ్‌లు, దుపట్టాలు ధరించిన మహిళలు, కుర్తాలు ధరించిన పురుషులు పండుగను జరుపుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. అటు ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న కరాచీలో ఇలాంటి దృశ్యాన్ని ధీరజ్ అనే మరో యూజర్ షేర్ చేశాడు.
పాకిస్తాన్ లో హిందువులు నిజంగానే నవరాత్రిని జరుపుకుంటారా? అనే దానిపై అనేక మంది సోషల్ మీడియా వినియోగదారులు సందేహం వ్యక్తం చేశారు. “పాకిస్తాన్ లో శాఖాహారులు, జైనులు ఉన్నారా?” అని ప్రశ్నిస్తున్నారు. మరో వ్యక్తి “పాకిస్తాన్‌లో ఇతరులు తమ సంప్రదాయాలను ఆచరించడం చూడటం ఆనందంగా ఉంది. మన దేశంలా వైవిధ్యాన్ని చూడటం నాకు చాలా ఇష్టం” అని రాసుకొచ్చాడు. “పాకిస్తాన్ లో ఉన్న హిందువులకు భారతదేశం నుంచి నవరాత్రి శుభాకాంక్షలు” అని కామెంట్ పెట్టాడు. చాలా మంది వీడియోలకు లవ్ ఎమోజీలతో స్పందించారు.
దుర్గాదేవిని.. ఆమె తొమ్మిది దైవిక రూపాలను గౌరవించడానికి తొమ్మిది రాత్రులు జరుపుకునే అత్యంత ముఖ్యమైన హిందూ పండుగలలో నవరాత్రి ఒకటి. ఈ సంవత్సరం ఈ పండుగ సెప్టెంబర్ 22న ప్రారంభమై అక్టోబర్ 2న ముగుస్తుంది. చెడుపై మంచి విజయాన్ని జరుపుకునే విజయదశమితో ముగుస్తుంది.
Read Also: బ్యాట్ తో కుర్రాళ్లు, లోకల్ ట్రైన్ లో ఆడాళ్లు.. గర్బా డ్యాన్స్ తో అదరగొట్టారంతే!
సాధారణంగా నవరాత్రి సందర్భంగా తొమ్మిది రోజులు తొమ్మిది రంగులు ధరిస్తారు. 6వ రోజు శుభప్రదమైన రంగు బూడిద రంగు, సమతుల్యత, ప్రశాంతత, స్థిరమైన శక్తిని సూచిస్తుంది. నవరాత్రిలో ప్రతి రోజు ఒక నిర్దిష్ట రంగుతో ముడిపడి ఉంటుంది
1వ రోజు – తెలుపు
2వ రోజు – ఎరుపు
3వ రోజు – రాయల్ బ్లూ
4వ రోజు – పసుపు
5వ రోజు – ఆకుపచ్చ
6వ రోజు – బూడిద
7వ రోజు – నారింజ
8వ రోజు – నెమలి ఆకుపచ్చ
9వ రోజు – గులాబీ రంగు ధరిస్తారు.
Read Also: దసరా పండుగ వచ్చేస్తోంది, వీలుంటే కచ్చితంగా ఈ ప్లేసెస్ కు వెళ్లండి!