12 Years For Attharintiki Daredhi : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హిట్టు ప్లాప్ తో సంబంధం లేకుండా అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కెరియర్ లో వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్ సినిమాలు మొదట్లో పడ్డాయి. ఖుషి సినిమా తర్వాత దాదాపు 10 సంవత్సరాలు పాటు పవన్ కళ్యాణ్ సినిమాలేవి బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్న స్థాయి సక్సెస్ అందుకోలేదు.
మామూలుగా సినిమాలు సక్సెస్ అవ్వకపోతే క్రేజ్ తగ్గడం జరుగుతుంది. అలానే అవకాశాలు కూడా రావడం కష్టంగా మారుతుంది. కానీ పవన్ కళ్యాణ్ లైఫ్ లో మాత్రం చాలా డిఫరెంట్ గా జరిగింది. అతని క్రేజ్ తగ్గలేదు, రెమ్యూనరేషన్లు కూడా విపరీతంగా పెరిగాయి. హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పటివరకు తెలుగు సినిమా చరిత్రలో ఉన్న అన్ని రికార్డ్స్ ను ఆ సినిమా తగలబెట్టేసింది. రీమేక్ సినిమాతో రికార్డ్స్ కొట్టిన ఘనత పవన్ కళ్యాణ్ కి ఉంది.
పవన్ కళ్యాణ్ కెరియర్లో అద్భుతమైన సక్సెస్ సాధించిన సినిమా అత్తారింటికి దారేది. జల్సా సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేసిన ఈ సినిమా ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ నమోదు చేసుకుంది. ఈ సినిమా హిట్ అవడం ఒక అచీవ్మెంట్ అయితే లీక్ అయిపోయిన సినిమా థియేటర్ లో అద్భుతమైన సక్సెస్ సాధించింది. పవన్ కళ్యాణ్ తో ఒక ఫ్యామిలీ స్టోరీ చెప్తే ఏ రేంజ్ లో వర్కౌట్ అవుతుందో త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రూవ్ చేసి చూపించాడు. అత్తారింటికి దారేది సినిమా తర్వాత ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఆ రేంజ్ హిట్ సినిమా పడలేదు. అజ్ఞాతవాసి సినిమాతో త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రయత్నించిన కూడా దానిని అచీవ్ చేయలేకపోయారు.
ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పవన్ కళ్యాణ్ రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత చాలామంది అభిమానులు దూరమైపోయారు. ఎక్కడో మూల పవన్ కళ్యాణ్ లో ఉన్న ఇష్టం తగ్గిపోయింది. ఓ జి సినిమాకి మంచి సక్సెస్ టాక్ వచ్చింది. కానీ కలెక్షన్స్ మాత్రం ఊహించిన రేంజ్ లో లేవు. మొత్తానికి అత్తారింటికి దారేది సినిమా వచ్చి నేటికీ 12 సంవత్సరాలు పూర్తయింది. పుష్కర కాలం తర్వాత పవన్ కళ్యాణ్ సక్సెస్ కొట్టడం కామన్. ఓజి సినిమాతో సక్సెస్ అయితే కొట్టారు, అది ఏ రేంజ్ అనేది తేలాల్సి ఉంది. ఏదేమైనా పవన్ కళ్యాణ్ కి అత్తారింటికి దారేది ఇలాంటి సక్సెస్ మళ్లీ పడుతుందా అని సందేహాలు చాలామందికి ఉన్నాయి.
Also Read: Raghava Lawrence : డౌన్ సిండ్రోమ్ పీపుల్ కు రాఘవ లారెన్స్ సేవ, వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు