Asia Cup 2025 : ఆసియా కప్ 2025లో ఇప్పటివరకు అన్ని మ్యాచ్ లు ముగిసిపోయాయి. ఇక చివరి ఘట్టం ఒక్కటే మిగిలి ఉంది. రేపే టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ లో ఎవ్వరూ విజయం సాధిస్తే.. వారిదే టైటిల్ సొంతం అవుతుంది. ఇప్పటికే పాకిస్తాన్ జట్టుతో లీగ్ దశలో ఒకసారి, సూపర్ 4 దశలో మరోసారి టీమిండియా ఓడించింది. ఫైనల్ లో ఓడించి ముచ్చటగా మూడుసార్లు ఓడించి రికార్డు సృష్టించాలని టీమిండియా భావిస్తే.. ఎలాగైనా విజయం సాధించి టీమిండియా పరువు తీయాలని పాకిస్తాన్ ఆశిస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది.
Also Read : IND Vs PAK : ఫైనల్స్ లో పాకిస్థాన్ ప్లేయర్స్ కు యానిమల్ మూవీ చూపించడం పక్కా..?
ఆసియా కప్ లో ఓ మ్యాచ్ జరుగుతున్న వేళ.. పాకిస్తానీయులు అరాచకాలు సృష్టించారు. స్టేడియంలోనే ఓ లేడీ అభిమానిపై అసభ్యంగా ప్రవర్తించారు. ఏకంగా లేడి అభిమాని ప్రైవేట్ పార్ట్స్ పై చేతులు వేసి మరీ చిరాకుగా వ్యవహరించారు. ఈ ఘటన సూపర్ 4 లో భాగంగా పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ లో చోటు చేసుకుంది. పాకిస్తాన్ ప్రజలు, ఆటగాళ్లు అందరూ ఇలాగే వ్యవహరిస్తారా..? అంటూ సోషల్ మీడియాలో పాకిస్తాన్ పై దారుణంగా ట్రోలింగ్స్ చేస్తున్నారు నెటిజన్లు. మరోవైపు పాకిస్తాన్ జట్టుకి టీమిండియా షాక్ ఇచ్చింది. వాస్తవానికి ఫైనల్ మ్యాచ్ జరిగే రోజు కంటే ముందు రోజు ఇరు జట్ల కెప్టెన్లు ఫొటో షూట్ ఉంటుంది. కానీ టీమిండియా-పాకిస్తాన్ మ్యాచ్ నేపథ్యంలో అలాంటి ఫొటోషూట్ రద్దు అయింది. ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ లకు కనీసం టీమిండియా ఆటగాళ్లు షేక్ హ్యాండ్ కూడా ఇవ్వడం లేదు. అలాంటిది ఫొటో షూట్ ఎలా ఉంటుందనుకుంటున్నారు అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
ఫొటో షూట్ లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాల్గొనకపోవడంతో తాజాగా ఫొటో షూట్ రద్దు అయినట్టు సమాచారం. ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా రేపు ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ జట్లు తలపడుతాయి. ఈ మ్యాచ్ దుబాయ్ వేదికగా రేపు రాత్రి 8 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా టాస్ గెలిచిన జట్టే విజయం సాధించేలా కనిపించింది. ఇప్పటివరకు రెండుసార్లు కూడా టీమిండియా ఫస్ట్ ఫీల్డింగ్ చేసింది. మరోవైపు టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే.. పాకిస్తాన్ పై విజయం సాధిస్తుందా..? అని కొంత మంది పాకిస్తాన్ అభిమానులు, ఆటగాళ్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేసినట్టు సమాచారం. మ్యాచ్ ఏదైనా.. పాకిస్తాన్ పై ఎప్పుడూ టీమిండియానే విజయం సాధిస్తుందని టీమిండియా అభిమానులు పాక్ కి కౌంటర్ ఇస్తున్నారు.
?igsh=MW8xdHJsaW13OGc0cg==