Raj Kundra: బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో శిల్పాశెట్టి (Shilpa Shetty)ఒకరు. కెరియర్ పరంగా సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈమె ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా(Raj Kundra)ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంట పిల్లాపాపలతో సంతోషంగా గడుపుతున్న సమయంలోనే రాజ్ కుంద్రా పై ఎన్నో రకాల విమర్శలు రావడంతో ఈయన గతంలో జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే.ఇలా ఈ వివాదాల నుంచి ఇప్పుడిప్పుడే ఈయన బయటపడుతున్న నేపథ్యంలో తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు.
రాజ్ కుంద్రా గత కొంతకాలంగా తరచూ ఇలాంటి వివాదాలలో నిలుస్తున్నారు. తాజాగా బిట్ కాయిన్ (Bit Coin)మనీలాండరింగ్ కేసులో భాగంగా ఈడీ చార్జ్ షీట్ దాఖలు చేయడంతోపాటు రాజ్ కుంద్రా పేరును కూడా జోడించింది. క్రిప్టో కుంభకోణంలో రాజ్ కుంద్రాకు 150 కోట్ల విలువైన 285 బిట్ కాయిన్లు అందినట్టు ఈడీ తమ ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. రాజ్ కుంద్రా ఈ బిట్ కాయిన్ల ఆధారంగానే మనీ లాండరింగ్ కి పాల్పడినట్టు అభియోగాలు వస్తున్నాయి. ఇక ఈ వ్యవహారంలో భాగంగా రాజ్ కుంద్రా తన లావాదేవీలను దాచిపెట్టడం కోసం తన భార్య శిల్పా శెట్టితో కలిసి పలు ఆర్థిక ఒప్పందాలను కూడా కుదుర్చుకున్నట్టు ఈడీ తమ ఛార్జ్ షీట్ లో పేర్కొంది.
మరి ఈ కేసులో భాగంగా రాజ్ కుంద్రా ఎలాంటి అభియోగాలను ఎదుర్కోబోతున్నారనే పూర్తి వివరాలు తెలియాల్సిందే. అయితే ఇప్పటికే ఈ దంపతులు ఓ వ్యాపారవేత్తను రూ. 60 కోట్ల మేరా మోసం చేశారనే ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇలా ఇటీవల వరుసగా ఈ దంపతులు న్యాయపరమైన చిక్కులలో ఉంటున్న నేపథ్యంలో వీరి అభిమానులు కూడా షాక్ అవ్వడమే కాకుండా ఈ విషయంపై బాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చలు కూడా జరుగుతున్నాయి. వ్యాపారవేత్తను మోసం చేసిన కేసులో భాగంగా వీరిపై లుక్ అవుట్ నోటీసులు ఉన్నాయి. ఇలాంటి తరుణంలోనే మరోసారి బిట్ కాయిన్ విషయంపై చిక్కుల్లో పడ్డారు.
జడ్జిగా వ్యవహరిస్తున్న శిల్పా శెట్టి..
ఇక గతంలో కూడా రాజ్ కుంద్రా పోర్న్ వీడియోల విషయంలో ఎన్నో అభియోగాలను ఎదుర్కోవడమే కాకుండా ఈ విషయంలో జైలుకు కూడా వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. ఏది ఏమైనా రాజ్ కుంద్రా, శిల్పా శెట్టి దంపతులు నిత్యం ఈ విధమైనటువంటి వార్తలలో నిలుస్తున్నారు. ఇక శిల్ప శెట్టి మరోవైపు తన కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఈమె పలు సినిమాలలో నటించడమే కాకుండా బుల్లితెర షోలలో జడ్జిగా పాల్గొంటూ సందడి చేస్తున్నారు. శిల్ప శెట్టి ఇటీవల కాలంలో సినిమాలు కంటే కూడా ఎక్కువగా బుల్లితెర కార్యక్రమాలకి అధిక ప్రాధాన్యత ఇస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.
Also Read: Little Hearts OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న లిటిల్ హార్ట్…ఇక నాన్ స్టాప్ నవ్వులే!