BigTV English

Mrigasira Karthe : మృగశిర కార్తెలో చేయాల్సి దానాలేమిటి..

Mrigasira Karthe : మృగశిర కార్తెలో చేయాల్సి దానాలేమిటి..
Mrigasira Karthe


Mrigasira Karthe : నిన్నటి వరకు రోహిణి కార్తె మండే ఎండలతో దడ పుట్టించింది. భానుడి భగభగలతో ఒళ్లంతా మండిపోయింది. ఇప్పుడు మృగశిర కార్తెతో ఎండలు పోయి వానలు మొదలవుతాయి. ఒక్కసారిగా మారే వాతావరణంతో శరీరం తట్టుకోవడానికి ఒక్క శక్తి కావాలి. సమతుల్య స్థితి క్రమంగా సాధించాలి కానీ ఒక్కసారిగా మార్పు రాకూడదు. ఇది నియంత్రించాలంటే శరీరానికి ఇంగువ అవసరం. ఇది వేడిని కలిగించే పదార్ధం . బెల్లం జీర్ణం కలిగిస్తుంది . మాంసాహారులు అయితే చేప ప్రసాదాన్ని తీసుకుంటారు. మన పండుగలన్నీ ప్రకృతితో ముడిపడి ఏర్పడినవే. మృగశిర కార్తె నుంచి రాళ్లు సైతం మెత్తబడిపోతాయంటారు. మృగశిర కార్తెను రైతుల ఏరువాక సాగే కాలంగా భావిస్తుంటారు.

మృగశిర కార్తె మొదటిరోజుల రకరకాల పేర్లతో పండుగ చేసుకుంటారు. మృగశిర ప్రారంభం రోజున చేపలు, ఇతర మాంసారం తీసుకుంటే జలుబు లాంటి ఇతర వ్యాధులను కంట్రోల్ చేసుకోవచ్చని అంటారు. మాంసారం తినని వారు ఇంగువ, బెల్లం శెనగ గింజ అంతా సమపాళ్లలో చేసుకుని తింటే సరిపోతుంది. మృగశిర నక్షత్రం దైవ సంబంధమైనది. దీనికి అధిపతి కుజుడుగా ఉన్నాడు. ఈ నక్షత్రంలో జన్మించే వారు అదృష్టవంతులవుతారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది . మృగశిర రెండు పాదాలు మిధున రాశిలో మరో రెండు వృషభరాశిలో ఉంటాయి. మృగశిర కార్తెలో కురిసే అవకాశాలు మంచి పంటల్ని ఇస్తాయి.


మృగశిర కార్తెలో మధ్యమ వర్షాలు, కొంచెం అల్ప వర్షాలు కురిస్తే రైతుకి ప్రయోజనం కలుగుతుంది. భయంకరమైన ఎండల నుంచి ఒక్కసారిగా వాతావరణం చల్లబడి వల్ల కొన్ని ఆరోగ్యసమస్యలు వచ్చే కాలం కావడంతో..ఈ టైంలో కొన్ని దానాలు చేయమని శాస్త్రం చెబుతోంది. అలాగే కొన్ని పదార్దాలను తప్పనిసరిగా భోజనంలో చేర్చుకోవాలని సూచిస్తోంది. కందిపప్పు, పెసర పప్పు, శెనగపప్పుని విరివిగా తీసుకోవడం మంచిది.

Related News

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Big Stories

×