Actor Suhas: ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా కలర్ ఫోటో (Color Photo)సినిమా ద్వారా హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు నటుడు సుహాస్(Suhas). ఇలా కలర్ ఫోటో సినిమా తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న ఈయన తాజాగా సోషల్ మీడియా వేదికగా ఓ శుభవార్తను తెలియజేశారు. సుహాస్ భార్య లలిత (Lalitha)మరో బిడ్డకు జన్మనిచ్చారు. ఇదివరకే లలితా సుహాస్ దంపతులకు ఒక కుమారుడు జన్మించారు. తాజాగా మరోసారి ఇద్దరు తల్లిదండ్రులుగా మారిపోయారు. సుహాస భార్య లలిత మరోసారి పండంటి మగ బిడ్డ(Baby Boy)కు జన్మనిచ్చారు.
ఇలా లలిత తన బిడ్డతో కలిసి హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఫోటోను ఈయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలతో పాటు అభిమానులు కూడా ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇలా మరో మగ బిడ్డకు జన్మనివ్వడంతో సుహాస్ ఇద్దరు మగ పిల్లలకు తండ్రిగా ప్రమోట్ అయ్యారు. ఇక లలితా సుహాస్ ఇద్దరిదీ కూడా ప్రేమ వివాహం అనే విషయాన్ని ఈయన పలు సందర్భాలలో వెల్లడించారు. ఇద్దరు ప్రేమించుకుని పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నట్లు తెలియజేశారు.
ఇక ఈ జంట 2024 జనవరి నెలలో ఒక మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఇలా బిడ్డ పుట్టడంతో బిడ్డతో కలిసి ఉన్న ఫోటోని సుహాస్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ప్రొడక్షన్ నెంబర్ వన్ అంటూ సినిమా స్టైల్ లోనే తనకు కొడుకు పుట్టిన విషయాన్ని వెల్లడించారు. అయితే తాజాగా మరో బిడ్డ జన్మించటం విశేషం. ఇక సుహాస్ కెరియర్ విషయానికి వస్తే ఎలాంటి సినీ నేపథ్యం లేకపోయిన షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ కొనసాగుతున్న ఈయన అనంతరం కలర్ ఫోటో సినిమాలో అవకాశాన్ని అందుకున్నారు .అయితే ఈ సినిమా నేరుగా థియేటర్లో కాకుండా ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
వరుస ప్రాజెక్టులతో బిజీగా సుహాస్..
ఇలా ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో సినిమాకు ఏకంగా నేషనల్ అవార్డు కూడా వరించడం విశేషం. ఇక ఈ సినిమా తర్వాత సుహాస్ వరుసగా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇక ఇటీవల ఈయన కీర్తి సురేష్ తో కలిసి ఉప్పుకప్పురంబు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇది కూడా ఓటీటీ లోనే విడుదల అయింది అదేవిధంగా ఓ భామా అయ్యో రామ అనే సినిమా ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.. ఇక ఈ రెండు సినిమాలు జులై నెలలో వరుసగా విడుదలై పర్వాలేదు అనిపించుకున్నాయి. ప్రస్తుతం ఈయన తన తదుపరి ప్రాజెక్టుల విషయంలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.
Also Read: Puri – Sethupathi: పూరి – సేతుపతి మూవీకి వెరైటీ టైటిల్… అసలు ఈ థాట్ ఎలా వచ్చిందో ?