BigTV English

Health problems due to fire : కార్చిచ్చు వల్ల ఆరోగ్య సమస్యలు.. అమెరికాలోనే ఎక్కువ..!

Health problems due to fire : కార్చిచ్చు వల్ల ఆరోగ్య సమస్యలు.. అమెరికాలోనే ఎక్కువ..!


Health problems due to fire : ఈరోజుల్లో అన్నింటికంటే పీల్చే గాలే ఎక్కువగా కలుషితం అవుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మిగతా కాలుష్యాలతో పోలిస్తే గాలి కాలుష్యమే ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా వ్యాప్తి చెందుతోంది. మానవాళి చేసే ప్రతీ పని గాలిని మరింత కలుషితం చేసేలా మారుతోంది. తాజాగా గాలి కాలుష్యానికి కారణమయ్యే కార్చిచ్చు కూడా అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని వారు చెప్తున్నారు. అందులోనూ ముఖ్యంగా ఈ సమస్య అనేది అమెరికాలోనే ఎక్కువగా ఉందని తేల్చారు.

అమెరికాలో అడవి ప్రాంతాల్లో చాలానే ఉన్నాయి. దానికి తగినట్టుగా తరచుగా అక్కడ కార్చిచ్చులు కూడా రగులుతూ ఉంటాయి. టెక్నాలజీ సాయంతో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఈ కార్చిచ్చుల సమస్య అనేది కంట్రోల్ అవ్వడం లేదు. ఇది అమెరికా వ్యాప్తంగా.. ముఖ్యంగా నార్త్ఈస్ట్‌లో గాలిని కలుషితం చేయడంతో పాటు.. ప్రజల ప్రాణాలకు కూడా ముప్పు కలిగిస్తుందని తాజాగా స్టడీలో తేలింది. దీనికి అమెరికాలో జరిగే కార్చిచ్చులు కొంత కారణమైతే.. కెనడాలో జరిగేవి మరికొంత కారణమని బయటపడింది.


కార్చిచ్చుల వల్ల ఎయిర్ క్వాలిటీ అనేది చాలావరకు దెబ్బతింటుందని, ఇక ఈ ఎయిర్ క్వాలిటీలో జీవించడం వల్ల వృద్ధులు, చిన్నపిల్లలు ఎక్కువగా అనారోగ్యం బారిన పడతారని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ప్రస్తుతం న్యూయార్క్ అధికారులు స్కూలు విద్యార్థులపై కఠినమైన రూల్స్‌ను విధించారు. స్కూలుకు వెళ్లే పిల్లలు బయట గాలిని పీల్చకుండా హై క్వాలిటీ మాస్కులను పెట్టుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. దీన్ని బట్టి చూస్తే అక్కడ ఎయిర్ క్వాలిటీ అనేది అత్యంత ప్రమాదకరమైన శాతానికి చేరుకుందని తెలుస్తోంది.

కార్చిచ్చు నుండి వచ్చే గాలి వల్ల లంగ్స్ వ్యాధులు ఉన్నవారికి మరింత హాని చేకూరుస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అస్థమా, ఊపిరితిత్తుల వ్యాధి ఉన్నవారు ఈ ఎయిర్ క్వాలిటీని బరించడం కష్టంగా మారుతుందని అన్నారు. దీంతో పాటు గుండె సంబంధిత వ్యాధుల వల్ల బాధపడుతున్నవారు కూడా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. వీరితో పాటు చిన్నపిల్లలు, వృద్ధులు కూడా జాగ్రత్తగా ఉండాలన్నారు. గాలి కాలుష్యం వల్లే అమెరికాలో ప్రతీ ఏడాది 1 లక్ష మరణాలు జరుగుతున్నాయని స్టడీలో వెల్లడించారు.

ఎయిర్ క్వాలిటీ అనేది అసలు బాలేకపోతే.. మనుషులకు హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువవుతాయని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. ప్రస్తుతం అమెరికాలో కార్చిచ్చు ప్రమాదాలు ఎక్కువగా జరగకపోయినా.. కెనడాలో ఏడాది దాదాపు 400 కార్చిచ్చు ప్రమాదాలు జరుగుతున్నాయని, దీని వల్ల బలంగా వీచే గాలులు ఈ కార్చిచ్చు గాలులను అమెరికావైపు తీసుకొస్తున్నాయని శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ స్మోక్ ట్రావెలింగ్ అనేది అదుపు చేయగలిగితే.. ఎయిర్ క్వాలిటీ మెరుగుపడే అవకాశం ఉందని వారు సూచిస్తున్నారు.

Related News

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

Big Stories

×