BigTV English

Chaturmasya Vrata : చాతుర్మస్య వ్రతాన్ని ఎవరు జరుపుకోవాలి?

Chaturmasya Vrata : చాతుర్మస్య వ్రతాన్ని ఎవరు జరుపుకోవాలి?
Chaturmasya Vrata


Chaturmasya Vrata : జూన్ 29న ఆషాఢ శుద్ధ ఏకాదశి. ఈ రోజున శయన ఏకాదశి లేదా తొలి ఏకదాశిగా పిలుస్తారు.. శయని ఏకాదశి నుంచి శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడని శాస్త్రం చెబుతోంది. ఆ రోజు నుంచి చాతుర్మాస్యం మొదలుకాబోతోంది. అప్పటి నుంచి చాతుర్మాస్య వత్రం ఆచరించుకోవచ్చు. శయన ఏకాదశిలో యోగనిద్రలోకి వెళ్లి మహా విష్ణువు మళ్లీ కార్తీక మాసంలో ఉద్దాన ఏకాదశి రోజు మళ్లీ వెలుగులోకి వచ్చి గరుడ వాహనంపై అందరికి దర్శనమిస్తాడు. ఈ 4 నెలల్ని కలిసి చాతుర్మాస్యంగా చెబుతారు. మధ్యలో బాధ్రపద మాసంలో వచ్చే ఏకాదశిని పరివర్తన ఏకాదశిగా పిలుస్తారు. . విష్ణమూర్తి అంటే విశ్వమంతా వ్యాప్తించిన ఒక శక్తిగా చెప్పాలి. అలాంటి శక్తి తనలోకి తాను అంతర్ముఖంగా ఉండే సమయం నాలుగు నెలలు . ఈ సమయంలో చేసే వత్రమే చాతుర్మస్య వ్రతం. లింగ భేదం లేకుండా ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరించుకోవచ్చు.

ఏ మతస్తులైనా ఏకులానికి చెందిన వారై భగవత్ అనుగ్రహం కావాలని కోరుకునే వారు ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. వైకుంఠ ప్రాప్తిని ఈ వ్రత ఫలితం ఇస్తుంది. నాలుగునెలలపాటు వ్రతం చేయాల్సి ఉంటుంది. అంత కాలం చేయలేని వాళ్లకి ఐదు ఆప్షన్లు కూడా ఉన్నాయి. నాలుగు నెలలు చేయలేని వాళ్లు రెండు నెలలు చేసుకోవచ్చు. అది కూడా చేయలేని భావించే వారు ఒక నెలపాటు ఆచరించవచ్చు. 30రోజల పాటు చేయలేని వాళ్లకి ఈ నాలుగు నెలల్లో వచ్చే 9 ఏకదశులనాడు వ్రతాన్ని అచరించినా పర్వాలేదు. లేదంటే శుక్లపక్షంలో వచ్చే ఐదు ఏకాదశ వ్రతం చేసినా చాలు.
ఈ వ్రతాన్ని చేసేందుకు కొన్ని నియమాలు పాటించాలి


చాతుర్మస్య వ్రతం చేసేవారు ఎంతకాలం చేయగలిగితే అంత కాలం తెల్లవారజామునే స్నానం చేసి శ్రీ మహావిష్ణువు కూర్చుని పూజించాలి. ఏపని చేస్తున్నా విష్ణుసహస్రనామాన్ని పటించడమే వినడమో చేయాలి. వత్రకాలంలో ఇష్టమైన వస్తువు లేదా పని లేదా ఇంకా ఏదైనా సరే దాన్ని వదిలిపెట్టాలి. మనసు దానిపైకి పోకుండా ఉండటానికే ఈ నియమం . మౌనవ్రతం పాటించాలి. అంటే అనవసరం అనిపించే ఏవిషయాన్ని ఎవరితో మాట్లాడకూడదు. నోటి నుంచి మంచిమాటలకు మాత్రమే రావాలి. ఈవ్రతాన్ని పాటిస్తే వారికి విపరీతమైన వాక్ శక్తి వస్తుంది. అందుకే మంచి మాటలు మాత్రమే చెప్పాలి. ఆరోగ్య సమస్యలు లేని వారు మాత్రం ఏకాదశినాడు ఉపవాసం ఆచరించాలి. ఆలయంలో గో సేవ చేయాలి లేదా ఆలయ సేవ చేసినా మంచిదని పురాణాలు చెబుతున్నాయి.

Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×