E-Paper
Advertisement

Lakshmi Kataksham : మంగళ, శుక్రవారాల్లో ఆ తీర్థాన్ని ఇంట్లో చల్లితే

Lakshmi Kataksham : మంగళ, శుక్రవారాల్లో ఆ తీర్థాన్ని ఇంట్లో చల్లితే
Advertisement
Remedies

Lakshmi Kataksham : ఇంటికి పూజ చేసే సమయంలో మంగళవారం, శుక్రవారంలకే ప్రాధాన్యం ఇస్తారు. ఆ రెండు రోజుల్లో పరిహారాలు పాటిస్తే మంచి ఫలితాలు కలుగుతాయని అంటారు. మంగళ, శుక్రవారాలే కొన్ని పరిహారాలు పనిచేయడానికి కారణం అమ్మవారు. ఈ చరాచర సృష్టికి మూలం అమ్మలగన్న అమ్మ జగదాంబ. ఆ తల్లి శక్తి ఎక్కువగా ఉండే రోజులు మంగళవారం,శుక్రవారాలు. అందుకే ఈ రెండు రోజులు మాత్రమే చేసే పూజలు మంచి ఫలితాలు ఇస్తుందని విశ్వాసం.

Advertisement

అలాంటి ఈ రెండు రోజుల్లో ఒక తీర్థాన్ని తయారు చేసి ఇంట్లో చల్లితే లక్ష్మీకటాక్షం కలుగుతుందని పరిహార శాస్త్రం చెబుతోంది.
మంగళవారం నాడు దుర్గాదేవికి నిమ్మకాలతో దీపాలు వెలిగించి పూజ చేస్తుంటారు. శుక్రవారం నాడు ప్రతీ ఇంట్లో శ్రీమహాలక్ష్మికి ప్రత్యేక పూజలు ఆచరిస్తుంటారు. ఈ రెండు పూజలు మరింత ఎక్కువ ఫలితాలను ఇవ్వాలంటే ఈ తీర్థాన్ని తయారు చేసుకుని ఇల్లంతా చల్లాలి.
ఇత్తడి లేదా రాగి లేదా వెండి పంచపాత్రలో పరిశుభ్రమైన నీటిని పోసి పసుపు కలిపి పచ్చకర్పూరం వేయాలి.
చిటికెడు కన్నా తక్కువ జవ్వాదు కూడా పంచపాత్రలో వేయాలి.

వీటితోపాటు రెండు లవంగాలు, యాలకులు వేసి, తులసి ఆకుల్ని జత చేయాలి. ఈ పంచపాత్రలోక అమ్మవారిని ఆవాహనం చేసుకుని పూజ గదిలో పెట్టాలి. మంగళవారం అయితే దుర్గాదేవి, శుక్రవారం నాడు మహాలక్ష్మి అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసి తర్వాత సాయంత్రం ఈ తీర్థాన్ని తమలపాకుతో ఇల్లాంతా చల్లాలి. నివాసంలో ప్రతీ మూలలోను తీర్థం చల్లడం ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ బయటకి పోయి లక్ష్మీకటాక్షం సిద్ధిస్తుంది. అరోగ్యసమస్యలు, ఆర్ధిక కష్టాలు తొలగిపోతాయని పరిహారశాస్త్రం వివరిస్తోంది. ఇంట్లో మనశ్శాంతి లేదని బాధపడేవారు తొమ్మిది మంగళవారాలు లేదా 9శుక్రవారాలు ఈ పరిహారాన్ని పాటిస్తే ఫలితం కలుగుతుంది.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×