జ్యోతిష శాస్త్రంలో కొన్ని గ్రహాలు కలిస్తే రాజయోగాలు ఏర్పడతాయి. ఆ రాజయోగాలు పన్నెండు రాశుల్లో కొంతమందికి విపరీతమైన లాభాలను తెచ్చిపెడతాయి. అలా త్వరలో హంస మహా పురుష రాజయోగం ఏర్పడబోతోంది. బృహస్పతి వల్ల ఈ మహాపురుష రాజయోగం వస్తుంది.
ప్రస్తుతం బృహస్పతి మిథున రాశిలో సంచరిస్తున్నాడు. అతడు అక్టోబర్ నెలలో కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ రాశిలో గురువు బలంగా ఉంటాడు. కర్కాటక రాశిలో బృహస్పతి సంచారం ఎంతో ముఖ్యమైనది. కర్కాటకంలో బృహస్పతి ప్రవేశం వల్ల పంచ మహాపురుష రాజాయోగాలలో ఒకటైన హంస మహా పురుష రాజయోగం ఏర్పడుతుంది. ఇది ఎన్నో రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా మూడు రాశుల వారికి ఎక్కువ ప్రభావం కనిపిస్తుంది. వారి జీవితంలో విజయం, గౌరవం, డబ్బు అన్నీ పెరుగుతాయి. అందులో మీ రాశి ఉందో లేదో చూసుకోండి.
కర్కాటక రాశి
హంస మహా పురుష రాజయోగం వల్ల కర్కాటక రాశి వారికి ఎన్నో శుభ ఫలితాలు తొక్కుతాయి. తమ చుట్టూ ఉన్నవారి విశ్వాసాన్ని వీరు పొందుతారు. ఉద్యోగులకు ఎంతో మేలు జరుగుతుంది. వారికి జీతం పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వ్యాపారంలో ఉన్నవారు కూడా విపరీతమైన లాభాలను పొందుతారు. సమాజంలో వారి గౌరవం పెరుగుతుంది. ఇక పెళ్లి కాని వారికి వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కర్కాటక రాశి వారికి అన్ని వైపుల నుంచి విజయాలు దక్కి అవకాశాలు కనిపిస్తున్నాయి.
కన్యా రాశి
కన్యా రాశి వారికి హంసరాజ యోగం అనేది ఎంతో సానుకూలంగా సాగుతుంది. ఆకస్మికంగా వీరికి డబ్బు వచ్చి పడే అవకాశం ఉంది. అలాగే ఎక్కడైనా ఇరుక్కుపోయిన డబ్బు లేదా అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారంలో ఉన్నవారికి పురోగతి ఉంటుంది. అలాగే ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు ఆర్థిక స్థిరత్వాన్ని పొందుతారు. అలాగే మానసిక ప్రశాంతత కూడా దక్కుతుంది. ఆత్మవిశ్వాసంతో వారు తమ లక్ష్యాలను సాధిస్తారు.
తులా రాశి
తులా రాశి వారికి హంసరాజయోగం ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగాలు చేసే వారికి కెరీర్లో ఉన్నత స్థాయి దక్కుతుంది. వ్యాపారవేత్తలకు భారీ లాభాలు వస్తాయి. జీవితంలో పురోగతి సాధించే అవకాశాలు ఉన్నాయి. మీరు తమ కృషికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. కొత్త అవకాశాలు, కొత్త విజయాలు, ఆర్థిక శ్రేయస్సు కలుగుతుంది.