Ntr Original Name : సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఫ్యాన్ వార్స్ అనేవి విచ్చలవిడిగా పెరిగిపోయాయి. ఒకప్పుడు ఫ్యాన్ వార్స్ మీ సినిమా ఎన్ని రోజులు ఆడింది, ఎన్ని సెంటర్స్ లో ఆడింది అంటూ చర్చలు జరిగేవి. కానీ ఇప్పుడు మీ సినిమా ఎంత కలెక్ట్ చేసింది. మా సినిమా ఎంత కలెక్ట్ చేసింది అనేటట్లు ఉన్నాయి. సినిమా రిలీజ్ అయిన రోజే బ్లాక్ బస్టర్ పోస్టర్ పడిపోతుంది. థియేటర్స్ ఖాళీగా ఉన్నా కూడా కలెక్షన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థం కాని పరిస్థితి. చాలామంది నిర్మాతలు అభిమానులను హ్యాపీగా ఉంచడానికి ఫేక్ పోస్టర్ రెడీ చేస్తూ ఉంటారు. అయితే ఈ పోస్టర్స్ చూసి మిగతా హీరోల అభిమానులు ఒకరితో ఒకరు ఆర్గ్యుమెంట్లు చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ ఆర్గుమెంట్లు ఏ స్థాయికి వెళ్లి పోతాయి అంటే ఫ్యామిలీ మెంబర్స్ కూడా తిట్టే రేంజ్ కు వెళ్లిపోతాయి.
సోషల్ మీడియా ట్రోలింగ్
ఈమధ్య ట్రోల్స్ అనేవి కామన్ అయిపోయాయి. రీ రిలీజ్ సినిమాలకు కూడా డిస్కషన్స్ మొదలుపెట్టడం అలవాటైపోయింది. ముఖ్యంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య ఇప్పుడు సోషల్ మీడియా వార్ మొదలైంది. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ మహేష్ బాబు ఫ్యాన్స్ మధ్య కోల్డ్ వార్ ఉండేది. అలానే కొన్ని ఆర్గ్యుమెంట్స్ కూడా ఆరోగ్యకరంగా ఉండేవి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మహేష్ బాబు ఫ్యాన్స్ ని పవన్ కళ్యాణ్ సినిమాకి తీసుకెళ్లడం. అలానే మహేష్ బాబు ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని మహేష్ బాబు సినిమాకు తీసుకెళ్దాం వంటి ఫ్యాన్స్ కూడా ఒకప్పుడు ఉండేవాళ్ళు. ఇకపోతే ఫ్యాన్స్ విషయం పక్కన పెడితే ఇప్పుడు కొన్ని పర్సనల్ విషయాల పైన కూడా మాట్లాడటం అలవాటుగా మారిపోయింది. దానిని ట్రెండ్ కూడా చేసే పనిలో పడిపోయారు.
ఎన్టీఆర్ అసలు పేరు అది కాదు
ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మహేష్ బాబు అభిమానులు విషయం పక్కన పెడితే, రీసెంట్ టైమ్స్ లో ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ అభిమానులు ఫ్యాన్ వార్స్ చేస్తూ ఉంటారు. ఈ తరుణంలో ఎన్టీఆర్ అసలు పేరు ఎన్టీఆర్ కాదు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో కొద్దిసేపటి నుంచి హల్చల్ గా మారింది. ఎన్టీఆర్ అసలు పేరు “మహమ్మద్ షరీఫ్ రసూల్ ఖాన్” ఫాదర్ నేమ్ నందమూరి హరికృష్ణ. అంటూ ప్రాపర్టీ టాక్స్ బిల్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఎంతవరకు ఒరిజినల్ అని చాలామంది డిస్కషన్స్ మొదలుపెట్టారు. ఈ తరుణంలో కొంతమంది గ్రోక్ ను కూడా సలహా అడగడం మొదలుపెట్టాడు. అయితే దీనిలో వాస్తవం లేదు అనేది గ్రోక్ క్లారిటీ ఇచ్చింది. వికీపీడియా సోర్సెస్ అన్నిటిని చూపించి ఎన్టీఆర్ అసలు పేరు నందమూరి తారక రామారావు అంటూ తెలిపింది.
Also Read : Anudeep Kv: ఫంకీ సెట్స్ లో అనుదీప్ కామెడీ, మళ్ళీ దొరికేసాడు