Dharsha Guptha: ఇటీవల కాలంలో మంచి పాపులారిటీ సొంతం చేసుకోవాలి అంటే కేవలం సినిమాలో సీరియల్స్ లో నటించడమే కాదు. సోషల్ మీడియా అనే ఒక ప్లాట్ ఫామ్ ఉపయోగించి కూడా ఎంతోమంది సెలబ్రిటీ హోదా అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడం ఇంస్టాగ్రామ్ ద్వారా వారికి సంబంధించిన అంశాల గురించి వీడియోలు ఫోటోలను షేర్ చేస్తూ ఎంతోమంది మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు . ఇలా సోషల్ మీడియా ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం అందుకుంటున్నారు. ఇక సెలబ్రిటీలు సైతం పెద్ద ఎత్తున ఇన్స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంటూ వారికి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
బిగ్ బాస్ కంటెస్టెంట్ గా దర్శా గుప్తా..
ఈ క్రమంలోనే నటిగా, ఇన్ఫ్లుయెన్సర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో తమిళ ముద్దుగుమ్మ దర్శ గుప్తా(Darsha Gupta) ఒకరు. దర్శ ముల్లం మలరుమ్(Mullum Malarum) అనే సీరియల్ ద్వారా తన కెరీర్‌ను ప్రారంభించారు. అనంతరం తమిళంలో బిగ్ బాస్ సీజన్ 8 (Bigg Boss 8)కార్యక్రమంలో కంటెస్టెంట్ గా కూడా పాల్గొని సందడి చేశారు. ఇలా బుల్లితెర సీరియల్స్ తో పాటు బుల్లితెర కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ సందడి చేస్తున్న దర్శ సినిమా అవకాశాలను కూడా అందుకున్నారు. రుద్రతాండవం, ఓ మై ఘోస్ట్ వంటి సినిమాలలో నటించిన ఈమెకు పెద్దగా పేరు ప్రఖ్యాతలు రాలేదని చెప్పాలి.
ఇంస్టాగ్రామ్ లో మిలియన్ సంఖ్యలో ఫాలోవర్స్..
పలు సినిమాలలో నటించిన దర్శ అవలుమ్ నానుమ్(Avalum Naanum) సిరీస్‌లో మానస పాత్ర ద్వారా ఎంతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉంటూనే ఇంస్టాగ్రామ్ ద్వారా తనకు సంబంధించిన ఫోటోలు వీడియోలను షేర్ చేస్తూ ఏకంగా 2.3 మిలియన్ ఫాలోవర్లను సొంతం చేసుకున్నారు. ఇక ఈమె ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎన్నో బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ భారీగా సంపాదిస్తున్నారు. ఇంస్టాగ్రామ్ ద్వారా సబ్‌స్క్రిప్షన్ సేవను కూడా నడుపుతోంది. ఇందులో భాగంగా కొన్ని ప్రత్యేకమైన వీడియోలతో పాటు సినిమాలను కంటెంట్ చెల్లింపు సబ్స్క్రైబర్లకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇలా నెలకు రూ. 440 లను చెల్లిస్తూ సుమారు 961 మంది ఈ సేవను పొందుతున్నారు.
యూట్యూబ్ ద్వారా అదనపు ఆదాయం..
ఇలా ఇంస్టాగ్రామ్ ద్వారా ఫోటోలు వీడియోలను షేర్ చేస్తూ నెలకు 4 లక్షల పైగా ఆదాయం పొందుతున్నారని తెలుస్తోంది. ఇవి కాకుండా పలు బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ మరికొంత ఆదాయాన్ని కూడా అందుకుంటున్నారు. ఈ విధంగా 31 సంవత్సరాల వయసులోనే ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ నెలకు లక్షల్లో ఆదాయం అంటే మామూలు సంపాదన కాదు. ఇక ఈ విషయం తెలిసిన ఎంతోమంది ఈ స్థాయిలో ఆదాయం లభిస్తే ఇక సీరియల్స్ కూడా అనవసరమేనని, ఈమె పనే బాగుంది అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇటీవల కాలంలో ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా ఇంస్టాగ్రామ్ యూట్యూబ్ ఛానల్ నడుపుతూ అదనపు ఆదాయాన్ని అందుకుంటున్న సంగతి తెలిసిందే.