Vithika sheru: వినాయక చవితి వచ్చేసింది..ప్రతి ఒక్కరూ చిన్న పెద్దా అనే తేడా లేకుండా వినాయకుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు.అయితే వినాయక చవితి సెలబ్రేషన్స్ అనేవి ప్రతి ఒక్కరు చేసుకుంటారు. సామాన్య వ్యక్తులతో పాటు సెలబ్రిటీలు ఇలా ప్రతి ఒక్కరు ఈ వినాయక చవితి వేడుకల్లో పాల్గొంటారు. చాలామంది సెలబ్రిటీలు తమ ఇంట్లో తాము స్వయంగా మట్టితో చేసిన వినాయక విగ్రహాలను పెట్టి పూజిస్తూ ఉంటారు. అలా తాజాగా ఓ హీరోయిన్ తన చేతులతో స్వయంగా మట్టి గణపతిని చేసింది. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
మట్టి వినాయకుడిని చేసి అందర్నీ ఆశ్చర్యపరిచిన హీరోయిన్..
హ్యాపీడేస్, కొత్త బంగారులోకం వంటి సినిమాలతో టాలీవుడ్ లో లవర్ బాయ్ ఇమేజ్ సంపాదించిన వరుణ్ సందేశ్ (Varun Sandesh) అంటే తెలియని వారు ఉండరు. వరుణ్ సందేశ్ భార్య వితికా శేరు (Vithika sheru) కూడా అందరికీ సుపరిచితమే. వితికా శేరు కూడా కొన్ని సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించింది. అయితే అలాంటి వితికా తాజాగా తన ఇంట్లో మట్టి గణపతిని చేస్తూ సోషల్ మీడియా ఒక అద్భుతమైన వీడియోని పోస్ట్ చేసింది. ఆ వీడియోలో ఏముందంటే.. “అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అని వితికా చెప్పి మట్టి గణపతిని తయారు చేయడం స్టార్ట్ చేసింది. అలా మట్టితో గణపతిని అద్భుతంగా తయారుచేసి పెట్టుకుంది. చివరిలో జై బోలో గణేష్ మహరాజ్ కు అంటూ వీడియోని ఎండ్ చేసి మా వినాయకుడు రెడీ..జై బోలో గణేష్ మహారాజ్ కి.. ఎలా అనిపించిందో చెప్పండి”..అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం వితికా శేరు తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన మట్టి గణపతి వీడియోకి చాలామంది స్పందిస్తూ అద్భుతంగా చేశారంటూ మెచ్చుకుంటున్నారు.
నెటిజన్స్ ప్రశంసలు..
మరి కొంతమందేమో వితికాకి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక ఇంకొంతమందేమో సెలబ్రిటీ అనే ఇగో ఏమాత్రం లేకుండా మట్టితో గణపతిని చేసి వినాయకుడి పట్ల తన భక్తిని చాటుకుంది అంటూ వితికా శేరుని మెచ్చుకుంటున్నారు..వితికా పర్సనల్ లైఫ్ కి వస్తే.. తెలుగు,తమిళ, కన్నడ భాషల్లో నటిగా రాణించిన వితికా ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో కూడా రాణించింది. టాలీవుడ్ లో సీరియల్స్ ద్వారా చిన్నతనంలోనే ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత కన్నడ సినిమాలతో హీరోయిన్ గా అడుగు పెట్టింది. అలాగే తెలుగులో వచ్చిన ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే సినిమాలోని స్వాతి పాత్రను తమిళ్ రీమేక్ లో పోషించింది. ఛలో,మై నేమ్ ఈజ్ అమృత, ప్రేమించే రోజుల్లో, ఝుమ్మంది నాదం,భీమిలి కబడ్డీ జట్టు,ప్రేమ ఇష్క్ కాదల్, పెళ్లి సందD, మహాబలిపురం,పెద్ద నంది ప్రేమలో మరి వంటి సినిమాల్లో నటించింది.
వరుణ్ సందేశ్ తో ప్రేమ, పెళ్లి..
ఇక వరుణ్ సందేశ్ తో కలిసి నటించిన పెద్ద నంది ప్రేమలో మరి అనే సినిమా సమయంలో ఆయనతో ప్రేమలో పడి 2015లో పెళ్లి చేసుకున్నారు.. ఇక పెళ్లయ్యాక కూడా పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూనే తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 లో వరుణ్ సందేశ్ తో కలిసి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది.అలా తన ఆట తీరుతో బుల్లితెర ప్రేక్షకులను కూడా మెప్పించిన వితికా బిగ్ బాస్ తర్వాత పలు ఈవెంట్లు వంటివి చేస్తూనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను అభిమానులతో పంచుకుంటోంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వితికా మెగా డాటర్ నిహారిక, మహాతల్లి జాహ్నవి తో కలిసి చేసే సందడి అంతా ఇంతా కాదు.
?utm_source=ig_web_copy_link
ALSO READ: Bigg Boss 9: నన్ను దూరం పెట్టారు.. అతడే జడ్జ్ గా ఎందుకు?