Anudeep Kv: నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో అనుదీప్ కేవీ దర్శకత్వంలో వచ్చిన కామెడీ ఎంటర్టైనర్ జాతిరత్నాలు.ఈ సినిమాని మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మించారు. ఫస్ట్ లుక్, ట్రైలర్‌లతోనే ఒక రకమైన క్యూరియసిటీ క్రియేట్ చేసిన ఈ సినిమా మార్చి 11న మహాశివరాత్రి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలక్షన్స్ రాబట్టింది. విడుదలకు ముందే పాజిటివ్ బజ్ తెచ్చుకున్న ఈ సినిమా.. అదే రీతిలో బాక్సాఫీస్ వద్ద కూడా అదరగొట్టింది.
కంప్లీట్ కామెడీ
సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఉండడంతో అందరూ.. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ బాగా ఎంజాయ్ చేశారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా అదిరిపోయే కలెక్షన్స్ వచ్చాయి. దీంతో బ్లాక్ బస్టర్ దిశగా జాతిరత్నాలు దూసుకుపోయింది. హిలేరియస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో రిపీటెడ్ ఆడియన్స్‌ని థియేటర్లకు రప్పించింది. ఇక అది అలా ఉంటే దర్శకుడు అనుదీప్ కేవీ ఒక్కసారిగా సూపర్ పాపులర్ అయ్యాడు. ఈ సినిమా తర్వాత శివ కార్తికేయన్ తో ప్రిన్స్ అనే సినిమాను తెరకెక్కించాడు అనుదీప్. ఈ సినిమా తెలుగులో మంచి రిజల్ట్ సాధించుకుంది కానీ తమిళ్లో మాత్రం ఊహించిన విజయాన్ని అందుకోలేకపోయింది.
సెట్ లో కామెడీ
ఇక ప్రస్తుతం అనుదీప్ కేవీ రవితేజతో సినిమా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తూ వచ్చాయి. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తుంది అని చాలాచోట్ల కథనాలు వినిపించాయి. కానీ వాటన్నిటికీ చెక్ పెడుతూ విశ్వక్సేన్ హీరోగా అనుదీప్ సినిమా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తుంది. ఈ సినిమాకి ఫంకీ అనే టైటిల్ ఖరారు చేశారు. ఇక ఈ సినిమా జాతి రత్నాలు లెవెల్ లో ఉండబోతుంది అని పలు సందర్భాల్లో నాగవంశీ కూడా తెలిపారు.
Also Read : Sree Vishnu: ఆ వీడియోలో ఉన్నది నేనే కానీ ఆ వాయిస్ నాది కాదు
ఈ సినిమా సెట్ లో అనుదీప్ వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది. అనుదీప్ కి ఒక రకమైన టిపికల్ కామెడీ టైమింగ్ ఉంటుంది. షూట్ గ్యాప్ లో అనుదీప్ వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. అవతల వ్యక్తి సెంట్ ఫ్రాన్సిస్ లో చదివాను అని చెప్పినప్పుడు. అవునా నేను కూడా సెయింట్ ఫ్రాన్సిస్లో చదివాను అని అనుదీప్ చెప్తాడు. వెంటనే అటు నుంచి అమ్మాయి సెయింట్ ఫ్రాన్సిస్ అనేది గర్ల్స్ కాలేజ్ అని సమాధానం ఇచ్చింది. ఓ ఇప్పుడు అలా మార్చారా అంటూ తెలివిగా సమాధానం ఇచ్చాడు అనుదీప్. ఈ వీడియోను విశ్వక్సేన్ ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ రావడం మొదలైంది.
?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==